అయితే ఇక మిగతా మార్గాలు దేనికి. వాటన్నిటికీ తిలాంజలి ఇచ్చి జ్ఞాన మార్గాన్ని పట్టుకొంటే సరిపోదా అంటే సరిపోతుంది వాస్తవానికి. సందేహం లేదు. అయితే అది ఉత్తమాధికారి మాత్రమే చేయగలడు. ఉత్తమాధి కారు లెందరున్నారు లోకంలో. వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. మిగతా జన బాహుళ్య మంతా మంద మధ్యముల జాబితాలో చేరినవారే అలాంటి వారొక్కసారిగా ఈ భూమికకు లంఘించలేరు. సోపాన క్రమంలో ప్రాకి చేరవలసి ఉంటుంది. ఈ సోపానాలే కర్మ-ఉపాసన -సమాధి- ఇలాంటి వన్నీ. వీటి మూడింటినీ కలిపి ఒక్క మాటలో వర్ణిస్తే అది యోగం. ఈ యోగాన్ని మొదట కొంతకాలం యథాశక్తిగా అనుష్ఠిస్తూ పోవాలి మానవుడు. దానితో బాగా సిద్ది కలుగుతుంది. సిద్ధి అంటే ఇక్కడ శుద్ది అని అర్థం. ఆవరణ విక్షేప శక్తుల విజృంభణ అణగారి పోవటమే శుద్ది. తన్మూలంగా సత్త్వం బాగా పెరిగి కొంత కాలానికి అప్రయత్నం గానే అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
64
కర్మణ్యే వాధి కారస్తే - మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూ - ర్మాతే సంగో స్వకర్మణి 2-47
యోగానికీ జ్ఞానానికీ ఇలాంటి అవినా భావ సంబంధ మొకటి ఉంది. యోగం పరిపాకానికి వస్తే గాని జ్ఞానమనేది ఉదయించదు. కాబట్టి జ్ఞానమే గదా కావలసింది- ఈ కర్మలు దేనికని నిరసించరాదు అది నేల విడిచిన సాము అవుతుంది. కర్మలు చేయవలసిందే. మానరాదు. అయితే మామూలుగా మనం ప్రతిరోజూ చేస్తూ ఉన్న పద్దతిలో చేయరాదు.
మరి ఎలా చేయాలంటారు. కర్మ కర్మగానే చేయాలి. అంటే ఈ పనిచేస్తే నాకీ ఫలితముంటుందని ఫలితం మీద ఆశపెట్టుకొని చేయరాదు. అలా పెట్టు కొంటే ఆ ఫలితం మనకనుకూలం కావచ్చు. ప్రతికూలం కావచ్చు. అనుకూల మైతే పొంగిపోతాము. ప్రతికూలమైతే క్రుంగిపోతాము. ఏదైనా చావు జంపులే. ఆ ఫలితమే మనలను బంధిస్తుంది. కర్మ ఫలానికి మన మెప్పుడూ నిమిత్తం కాగూడదు. అయితే అది సంగమే.
అలాగని అసలు కర్మనే మాని వేయరాదు! మానితే అది సోమరితనమవు తుంది. పైగా దుష్కర్మా సత్కర్మా రెండు మానివేశాము కాబట్టి సాధనకే అస్కారం లేదు. సాధన చేస్తే గదాసిద్ధి. సిద్ధి మనకిక్కడ జ్ఞానోదయం. జ్ఞాన ముదయించా
Page 76