#


Back

పోయామంటే ఇక అంతూ అకాశమూ లేదు. పరమ పదానికి అంతకంతకూ దూరం కావటమే తప్ప దగ్గర పడటమంటూ ఉండబోదు.

అయితే ఇంత అనర్థం కలిగేట్టయితే అవి అసలు సాధన మార్గాలెలా కాగలిగాయని మరలా ప్రశ్న రావచ్చు. మార్గ మంటే సాక్షాత్తుగా కాదని పేర్కొ న్నాము. సాక్షాత్తుగా కాకపోయినా పరం పరగా సాధనాలవుతా యవి భేదాన్ని బోధించేవి పరంపరగా మాత్రమెలా సాధనా లవుతాయి అని అడగవచ్చు. అదే చిత్రం. భేద రూపమే అయినా అవి- పరతత్త్వాన్ని దృష్టిలో ఉంచుకొనే అనుస రిస్తున్నాము కాబట్టి తన్మూలంగా చిత్త శుద్దినీ- ఏకాగ్రతనూ ప్రసాదిస్తాయి. పరిశుద్ధమూ నిశ్చలమూ అయిన చిత్తం జ్ఞానోత్పత్తికి యోగ్యమవుతుంది. ఆ జ్ఞానం వల్ల సాయుజ్యం లభిస్తుంది. ఇలా భేద రూపమైన నిష్కామ కర్మాదులు చివరకు జ్ఞానం ద్వారా మోక్షానికే తోడ్పడుతున్నాయి కాబట్టి పరంపరగా అవీ సాధనా లేనని చాట వలసి వచ్చింది. అంతేగాని నిజానికి జ్ఞాన మనేది ఒక్కటే ఖచ్చితమైన సాధన మార్గం.

63
నహిజ్ఞానేన సదృశమ్ - పవిత్ర మిహ విద్యతే
తత్స్యయమ్ యోగ సంసిద్ధః - కాలే నాత్మని విందతి   4-38

అసలు జ్ఞానంతో సమానమయింది మరేదీ లేదీ సృష్టిలో. ఎందుకంటే సృష్టి కర్త జ్ఞాన స్వరూపుడు. "ప్రజ్ఞానం బ్రహ్మ” అని గదా ఉపనిష ద్వాక్యం. అలాంటి సృష్టికర్తవల్ల ఏర్పడిన సృష్టి కూడా జ్ఞానస్వరూపమే. సువర్ణం వల్ల ఏర్పడిన ఆభరణం సువర్ణంకాక మరొకటి ఎలా అవుతుంది. అలాగే సృష్టి కూడా జ్ఞాన స్వరూపమే. పోతే సృష్టికర్తను అన్వేషించే సాధనంకూడా మరొకటి కావటానికి వీలులేదు. అది కూడా జ్ఞానమే కావలసి ఉంది. అవి రెండూ ఒక్కటే నని గ్రహించటమే గదా జ్ఞానమంటే. కాబట్టి జ్ఞానమే ఏకైక మార్గం. మరేదీ గాదు.

అది ఏకైకమే కాక పవిత్రం కూడా. మాలిన్యాన్ని తొలగించే దేదో అదే పవిత్రం. మాలిన్యం మనకీ అనాత్మప్రపంచమే. నామ రూపాత్మకమయిన ఈ ప్రపంచమంతా పూర్తిగా తొలగి పోవాలంటే అది కర్మో పాసనాదులవల్ల దేని వల్లా సమకూరేది కాదు. కారణ మేమంటే అందులో భేద వాసనలు అంతో ఇంతో వ్యాపించి ఉంటాయి. ఒక్క జ్ఞానంలోనే అలాంటి భేద దృష్టి లేనిది. అందుచేత పావనమైన మార్గం కూడా అదే.

Page 75