#


Back

ఇలాంటి కష్టనష్టా లేవీ లేవు ఈ సాధన మార్గంలో. ఇందులో చేసిన కృషి ఎంత స్వల్పమైనా అది చెడిపోదు. చేయకపోతే దానివల్ల ప్రత్యవాయ దోషం లేదు. చేసింది కొంచెమైనా కాలాంతరంలో చాలా పెద్ద విపత్తు నుంచి మనలను కాపాడుతుంది. అంచేత మానవుడై పుట్టి కృషి చేయనివాడు పాపాత్ముడు. కొంత చేసి వెనుకకు తగ్గినవాడు అంత కన్నా అవివేకి. పోతే కృషి చేయవలసిందే. అది ఫలిత మిచ్చేదాకా సాగించవలసిందేననే మనమర్థం చేసుకో వలసి ఉంది.

62
వ్యవసాయాత్మికా బుద్ధి-రేకేహ కురునందన
బహు శాఖా హ్యనంతాశ్చ-బుద్దయోవ్యవసాయినామ్   2-41

అయితే ఈ కృషి లేదా సాధన అనేది నాలుగు విధాలుగా పేర్కొన్నాము. అన్ని మార్గాలూ ఉపాదేయాలే నని చెప్పాము. కానీ ఇందులో సాధకుడు గమ నించవలసిన రహస్యమొకటి ఉన్నది. అన్నీ మంచివే అయినా వాటిలో జ్ఞాన మనేది అన్నిటికన్నా ఉత్తమ మనే మాట మరచిపోరాదు. దానికి నోచుకోగలిగితే మిగతా మూడూ అక్కర లేదసలు, దానిలోనే అవి కూడా కలిసి వస్తాయి. అందుకు ఎప్పుడు నోచుకోలేదో అప్పుడే ఇవి మూడూ యధా శక్తిగా ఒక్కొక్కటీ ఆశ్రయించవలసి వస్తుంది.

నాలుగూ మార్గాలే అంటూ మరలా జ్ఞానమే గొప్ప దెలా అయిందని అడగవచ్చు. అది వ్యవసాయాత్మకం. వ్యవసాయమంటే దృఢమైన నిశ్చయం. అంతా ఆత్మ చైతన్యమే. జ్ఞేయమైన ఈ ప్రపంచమూ అదే-జ్ఞాత అయిన ఈ జీవుడూ అదే-అనే దృష్టి అది. ఇలాంటి దృష్టి ఎప్పుడూ మారేదికాదు గనుక అది ఏక రూపంగానే ఉంటుంది. ఈ విధంగా వ్యవసాయాత్మకమూ ఏక రూపమూ అయింది కాబట్టి జ్ఞానమనేది మోక్షానికి సాక్షాత్తుగా సాధన మవు తుంది.

పోతే మిగతా మూడు ఇలా సాక్షాత్తుగా సాధనాలుకావు. కారణం వాటి మూడింటిలోనూ జ్ఞాతృజ్ఞేయ భేదముంది. భేదదృష్టి ఏ మాత్రమున్నా అది గమ్యానికి దూరమే. గమ్యమనేది సర్వాత్మ భావమే గదా. అది అభేదరూపమే గాని భేద రూపంకాదు. భేదంతో అభేదాన్ని ఎలా అందుకోగలం. భేదమెప్పుడూ ఒక్క భేధంతో నిలవదు. అది మరొక భేదానికి అది మరొకదానికి దారి తీస్తుంది. అన్నీ కలిసి శాఖోప శాఖలై అసంఖ్యాకంగా పెరిగిపోతాయి. ఆ చట్రంలో పడి

Page 74