గ్రుడ్డికన్నా మెల్లమేలన్నట్లు అది కూడా కొంత మంచిదే. జ్ఞానం లేదేగాని వారికి శ్రద్ధాభక్తులున్నాయి. స్వయంగా చేయలేరే గాని చెబితే చేస్తారు. చేసేది మంచి పనే కాబట్టి అలా చేస్తూ పోతే కొంత కాలానికి చిత్తం శుద్దమవుతుంది. అంటే రజస్తమస్సులు పోయి సత్త్వం మిగులుతుందని అర్థం. సత్త్వమెప్పుడు ఆవిర్భవించిందో అప్పుడు జ్ఞానమనేది తప్పకుండా ఉదయిస్తుంది. “సత్వా త్సంజా యతే జ్ఞాన”మని గీతా భగవానుడు హామీ ఇచ్చాడు. ఇక్కడ రజస్త మస్సులు నశించటం క్షేత్రాన్ని తయారు చేయటమైతే- సత్త్వం పరిశుద్ధం కావటం బీజావాపం లాంటిది. పోతే జ్ఞానోదయ మనేది ఆ బీజంలో నుంచి అంకురం మొలకెత్తటం వంటిదని భావించాలి మనం.
61
నేహాభిక్రమ నాశోస్తి - ప్రత్యవాయోన విద్యతే
స్వల్పమవ్యస్య ధర్మస్య - త్రాయతే మహతో భయాత్ 2-40
ఇంతకూ ఏ మార్గాన్ని అవలంబించినా మనకు మోసంలేదు. ఉత్తమం మొదలుకొని అతి మందం దాకా అన్నీ సాధనలో మార్గాలే. కేవలం లౌకికంగా బ్రతికిపోయే దానికంటే సాధనలో అడుగుపెట్టడం మంచిదేగదా. అసలు పెట్ట కుంటేనే ముప్పుగాని పెట్టినప్పటి నుంచీ అంతో ఇంతో ఫలితముండనే ఉంది సాధకుడికి.
అంతేకాదు. ఏ పని అయినా లోకంలో కొంతదూరం చేసి మధ్యలో వదిలేస్తే దానివల్ల నష్టపోతాము. ఒక వ్యవసాయమే ఉందనుకోండి. రైతు పొలాన్ని బాగా దున్ని పదునుచేసి సకాలంలో విత్తనాలు చల్లి తరువాత దాని జోలికిపోకుండా ఉపేక్షించాడంటే చాలు. పంట చేతికి రాకపోగా అంతకు ముందు తాను చేసిన కృషి కూడా వ్యర్ధమవుతుంది.
ఇంకా ఒకటి ఉంది లోకంలో. ఒకటి అసటు ఆరంభించక పోయిన ప్రమా దమే. సత్ఫలితం లేకపోవడమే కాక దుష్ఫలితం కూడా ఏర్పడవచ్చు దాని మూలంగా. ఒక రోగానికి దగిన చికిత్స చేయక ఉపేక్షిస్తే అది మన కనర్థదాయ కమేగదా. ఇది లోకవ్యవహారంలో ఎలాగో- శాస్త్ర వ్యవహారంలో కూడా అలాగే. దీనికే ప్రత్యవాయమని పేరు. మన విధులు మనం చక్కగా నిర్వర్తించకపోతే దాని వల్ల మంచి జరగక పోవడం దేవుడెరుగు ఎన్నో అవాంతరాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
Page 73