Back
తానే అది-అనే ఏకాత్మ భావంతో చూడాలి దాన్ని. అప్పుడది ఆత్మీయంగానే కాక ఆత్మగానే అనుభవానికి వస్తుంది. ఇందులో చైతన్యాన్ని అంతటా దర్శించటం జ్ఞానమైతే-దానిని ఆత్మీయంగా భావించడం భక్తి అవుతుంది. మరి ఆత్మగానే భావన చేస్తే భక్తికూడాకాదు. యోగమని పించు కొంటుంది. ఇవి మూడూ సాధకుని ప్రయాణ సామగ్రి.
ఇవి కాక నాలుగవది ఒకటున్నది. ఇంతవరకూ వర్ణించిన జ్ఞానాదులు సాధకుడి మనస్సుకు సంబంధించిన పరికరాలు. ప్రాణానికి సంబంధించినవి కావు. చైతన్య శక్తి మన శరీరంలో ప్రవేశించినపుడు ఒకటిగా ప్రవేశించలేదు. అది రెండుపాయలై ప్రవేశించింది. ఒకటి మనస్సు. మరి ఒకటి ప్రాణం. ఇందులో మనస్సనేది చిచ్ఛక్తి ప్రధానంగా అవతరిస్తే-ప్రాణం సచ్ఛక్తి ప్రధానంగా బయలుదేరింది. రెండింటినీ కూడా సాధకుడు ఆ మూల చైతన్యం లోకే మరలా లయం చేసేకోవలసి ఉంది. అందులో ఇప్పుడు చెప్పింది మనోలయం మాత్రమే. పోతే ప్రాణలయం వర్ణిస్తున్నాడు ప్రస్తుతం భగవానుడు.
ఈ ప్రాణాన్ని మసం భ్రూమధ్యంలో ప్రవేశ పెట్టాలట. భ్రూమధ్యమంటే నాసికా మూలం. ఖేచరీ ముద్రా స్థానమదే. "ఖ" శబ్దాని కాకాశమని అర్ధం. నాసికామూలాన్ని దృష్టించి చూస్తే శూన్యమే కనిపిస్తుంది. మనకు శూన్యమే ఆకాశం. కాబట్టి ప్రాణ శక్తిని ఆకాశంతో కలపాలని అర్థమైంది. ప్రాణమంటే ఒక చలనమే కదా. చలనాన్నంతటినీ చలనం లేని దశలోకి తర్జుమా చేయాలి. అప్పుడది సద్రూపంగా నిలిచిపోతుంది.
మనసు చిద్రూపమైతే ప్రాణం సద్రూప మౌతుంది. చిత్తును విడిచి సత్తూ-సత్తును విడిచి చిత్తూ- ఉండవు కాబట్టి రెండూ కలిసి ఒకే ఒక అఖండ బ్రహ్మ తత్త్వంగా పరిణమిస్తాయని భావం. అలా పరిణమించిన మరుక్షణం ఇక సాధకుడు పురుషుడు కాడు. పురుషోత్తముడే.
52
అభ్యాసయోగ యుక్తేన - చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్|| 8-8
ఈ వర్ణించిన పద్ధతిని చూస్తే చాలా రమణీయంగానే ఉన్నది గాని ఇలాంటి గొప్ప అదృష్టం మానవులకు పడుతుందా అని మరలా అనుమానం. ఎందు
Page 64