బ్రహ్మవృత్తిని విస్మరించామంటే దానికి హేతువు ప్రాపంచికవృత్తులే. అవి సవికల్ప వృత్తులు. వాటితో నిర్వికల్పమైన ఈ వృత్తి దెబ్బతినడం సహజమే. అలాంటప్పుడీ నిర్వకల్పవృత్తిని కాపాడుకోవాలంటే ఆ సవికల్ప వృత్తులు ప్రవే శించకుండా వాటితో పోరాటం సాగించవలసి వుంటుంది. ఒకవైపు వాటితో పోరాడుతూ మరొకవైపు తత్త్వాను సంధాన మేమరకుండా ఉండటమే సాధకుడి కర్తవ్యం.
ఇలా రెండు మార్గాలలోనూ అభ్యాసం కొనసాగించామంటే కొత కాలానికి అసలీ సవికల్పవృత్తులు చిత్తంలో తల ఎత్తనేలేవు. దానితో బ్రహ్మవృత్తి ఒక్కటే ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజ్యం చేస్తుంది. సాధకుడి మనసు-బుద్ది- ఈ రెండూ కలిసి ఆ క్షణంనుంచీ బ్రహ్మమునందే అర్పితమౌతాయి. అదే నిజమైన ఆత్మా ర్పణ. ఈ అర్పణ అతణ్ణి తిన్నగా బ్రహ్మవదానికే తీసుకుపోతుంది. సందేహం లేదు.
51
ప్రయాణకాలే మనసా చలేన
భక్త్యాయుక్తోయోగబలేన చైవ
భ్రువోర్మధ్యే ప్రాణమావేస్యసమ్య
కృతంపరం పురుషముపై తిదివ్యం 8-10
బ్రహ్మపదాన్ని చేరుస్తుందని వర్ణించాము. అయితే అలా చేర్చటానికి అవకాశమివ్వాలి సాధకుడు. అంటే ప్రయాణానికి కావలసిన సామగ్రినంతా సమకూర్చుకోవాలని అర్థం.
ప్రయాణమని తెలియగానే మనస్సును చలిచకుండా చేయటం మొదటి కర్తవ్యం. చిత్రవిచిత్రమైన భావాలు రాకుండా చిద్రూపమైన భావన ఒక్కటి ఏర్ప డితే చాలు. అదే మనసు చలించకుండా పోవటం. చలించకపోతే అది అచల మవుతుంది. అచలమైన మనసులో ఇక అచలమైన చైతన్యరసమే తోణికిస లాడుతుంది.
కానీ దాన్నికూడా సాధకుడిమనసు దూరంగా ఉంచుకొని చూస్తే ప్రయో జనం లేదు. తనదిగా అభిమానించి తనకాత్మీయం చేసుకోవాలి. అప్పుడది చాలా సన్నిహితంగా వస్తుంది. అలా వచ్చినప్పటికీ సుఖంలేదు. అదేతాను-
Page 63