పోతే వేదాంతులు వర్ణించే భ్రమర కీటన్యాయ మొకటి ఉంది. అదికూడా ఇలాంటి భావనే. నిరంతర భ్రమర సాహచర్యల వల్ల తదీయ ఝంకారా కర్ణణం వల్ల కొన్నాళ్ళకు కీటకం భ్రమరంగా మారిపోతుంది. అంతేందుకు పరుస వేది ప్రభావం వల్ల లోహం బంగారంగా మారటం లేదా. అంటు కట్టటం మూలంగా ఒక చెట్టుకు మరొక చెట్టు లక్షణాలు సంక్రమించటం లేదా.
దీనిని బట్టి జీవుడు కూడా నిరంతర స్మరణ మూలంగా ఈశ్వర తత్త్వాన్ని పొందటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటకు వస్తే క్రొత్తగా పొందటం కూడా కాదిది. అంతకుముందు కూడా ఈశ్వరుడే జీవుడు. అయితే అ విద్యా దోషం వల్ల కాదనుకొని సంసార జంబాలంలో చిక్కుకొన్నాడు. ప్రస్తుతం శాస్త్రాచార్య ప్రబోధజనిత నిరంతరాను సంధానం వల్ల మరలా తన ఈశ్వరత్వాన్ని తాను జ్ఞప్తికి తెచ్చుకో గలిగాడు. ఇదే పొందట మనే మాటకు అర్థం.
50
తస్మా త్సర్వేషు కాలేషు - మా మనుస్మర యుధ్య చ
మయ్యర్పిత మనో బుద్ధి - ర్మా మే వై ప్యస్య సంశయః 8-7
అంచేత మనం చేయవలసిన సాధన ఏమిటింతకూ. క్రొత్తగా ఏదో సాధిం చడమనేది ఎప్పుడూ లేదు. ఉన్న దానినే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మన స్వరూపమే. శుద్దమైన సర్వవ్యాపకమైన చైతన్యం. అహమహ మనే రూపంలో ఉన్నదది. అలాంటి అహమాకారవృత్తి నెప్పుడూ ఆవృత్తి చేసుకొటూ కూచోటమే మన విధి. ఎప్పుడూ అంటే సర్వకాల సర్వావస్థలలోనని అర్థం. ప్రతిక్షణమూ అలా లనుసంధానం చేస్తూ పోతేగాని వృత్తి దృఢంగా నిలవదు.
ఈ వృత్తికే బ్రహ్మాకారవృత్తి అనీ- అఖండాకారవృత్తి అనీ - ఆత్మాకార వృత్తి అనీ - పర్యాయపదాలు, ఒక్క నిమిషంకూడా దీని నేమరరాదు. సంగీతంలో శ్రుతిలాగా ఇది ఎప్పుడూ అంటిపట్టుకొనే ఉండాలి సాధకుణ్ణి. విస్మరిస్తే ఆ మేరకు మరలా అజ్ఞాన పిశాచం వచ్చి నెత్తిన పడుతుంది. దానితో బ్రహ్మం మరలా నామ రూపాత్మకమైన ప్రపంచంగా భాసిస్తుంది. కాబట్టి ఒకవేళ తాత్కా లికంగా తొలగినా దాని నెప్పటికప్పుడు మరలా అనుసంధానం చేసుకొంటూ పోవాలి. తెగితే ముడి పెట్టటానికే అనుసంధానమని పేరు. దానివల్ల మనో మాలిన్యం ఎప్పటికప్పుడు ప్రక్షాళితమై బ్రహ్మవృత్తి ప్రతిష్టితమవుతుంది.Page 62