#


Back

కంటే ఏది సాధించినా చివరకు మనసుతోనే కదా సాధించాలి. ఆ మనసనేది ఎలాంటిదో మనకు తెలుసు. అంత చంచలమైన పదార్ధమే లేదు సృష్టిలో. అది అచలమైన స్థితికి వస్తేనే తప్ప మనకా పరతత్త్వాన్ని అందుకొనే ఆశలేదు. అలాంటప్పుడిక దాన్ని ఎంతవర్ణించి ఏమి ప్రయోజనం. దాన్ని సాధించే మనసు మనకు వశమయ్యేది లేదు కదా.

వాస్తవమే అలాగని ఉపేక్ష వహించరాదు. వహిస్తే యావజ్జీవమూ అలాగే ఉండిపోతాడు మానవుడు. ఏ ఒక్కటీ సాధించలేడు. సాధకుడెప్పుడూ అభ్యసం సాగిస్తూనే ఉండాలి. తప్పదు. అభ్యాసం సాగించే కొద్దీబుద్ధి పదునెక్కుతుంది. నిర్మల మౌతుంది. క్రమంగా స్వరూపభావనతో నిండిపోయి అన్యభావాలను గూర్చి ఆలోచించటం మానివేస్తుంది. అది మానేకొద్దీ బ్రహ్మభావనే దృఢమౌతూ వస్తుంది.

అలా అయితే చివరకు ప్రయాణకాలం దగ్గర పడే క్షణంలో కూడా అలవాటు కొద్దీ అదే బ్రహ్మ భావనలో నిలవ గలుగుతాడు మానవుడు. ప్రాణం పోయే సమయంలో కూడా నేనే బ్రహ్మాన్ని అనే అఖండ వృత్తిని ఏ మాత్రమూ విస్మరించడు. విస్మరణమే మరణం. కనుక నిరంతర స్మరణ మేమరని సాధకుడు తప్పకుండా సాయుజ్య మందుకోగలడు.

53
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥   8-11

పరమపదం పొందుతాడనీ సాయుజ్యం చెందుతాడనీ- బ్రహ్మాండంగా వర్ణించారు. బాగానే ఉంది. అయితే ఇంతకూ ఆ సాయుజ్యమనేది ఏమిటి, ఆ పరమపద మేమిటని ప్రశ్న.

దాని నక్షరమని పేర్కొంటారు వేదవిదులు. అక్షరమంటే క్షరం కానిది. శబ్ద బ్రహ్మమని అర్థం. కర్మపరాయణులైన మీమాంసకులంతా శబ్దమే నిత్యమనీ అపౌరుషేయమనీ - అదే బ్రహ్మ స్వరూపమనీ - భావిస్తారు. శబ్దాన్ని మించిన ఈశ్వరతత్త్వాన్ని వారు అంగీకరించరు.

Page 65