అప్పుడీ అనాత్మ ప్రపంచం కూడా ఆయా విశేష రూపాలుగా కాక ఆత్మరూపంగానే గోచరిస్తుంది కాబట్టి ఆత్మా నాత్మలు రెండింటినీ ఆత్మ రూపంగానే చూచినట్టవు తుంది. ఉభయో రపి దృష్టోంతః అంటే ఇదే అర్థం. ఆత్మా నాత్మల రెండింటి అంతమూ ఆత్మే. ఇలా రెండింటినీ కలిపి ఒకే ఒక చైతన్యంగా దర్శించటమే తత్త్వ దర్శనం. అంతే గాని కేవల మాత్మను మరచి ఆనాత్మనే చూడటం గాదు. అలా చూడటం వల్లనే మరణ భయం మానవులకు.
3
అంత వంత ఇమేదేహా- నిత్యస్యోక్తా శ్శరీరిణః
అనాశినో 2 ప్రమేయస్య- తస్మాద్యుధ్యస్వ భారత. 2-18
ఇందులో మనం గ్రహించవలసిన రహస్య మేమంటే-యధ్భావస్తద్భవతి. దేనితో తాదాత్మ్యం చెందితే అదే అవుతాడు మానవుడు. అలా అయినప్పుడు దాని గుణాలే సంక్రమిస్తాయి మనకు. ప్రస్తుతం మనమంతా ఆబాల గోపా లమూ ఈ దేహంతో తాదాత్మ్యం చెంది కూచున్నాము. ఎన్నో జన్మలనుంచి పెట్టుకొన్న ఈ సంబంధంవల్ల దీని లక్షణాలే మనకు సంక్రమించాయి. దీని లక్షణాలేమిటి, ఒక్క మాటలో చెబితే ఎప్పటి కప్పుడంతమై పోవటం. శరీర మనేది నిత్యమయిన పదార్థంగాదు. నిత్యమయితే అంతరించరాదు. ఇది కొన్నా యితే కనపడకుండా నశించిపోతున్నది. మన వ్యష్టి శరీరమూ నశిస్తున్నది. సమష్టి రూపమైన ఈ విశ్వ శరీరమూ నశిస్తున్నది. ఎప్పుడో ఒకప్పుడనిగాదు. ఎప్పుడూ నశిస్తూనే ఉంది. మార్పు చెందటమే నశించటమంటే. మార్పంటే ఏమిటి. ముందున్న దశపోయి మరొక దశ రావటమే గదా. ఇలా ప్రతిక్షణమూ దశలు మారుతూపోతే అది వినాశమే గదా శరీరానికి.
ఇలా ప్రతిక్షణమూ వినాశం పాలవుతూ ఎప్పుడో ఒక క్షణంలో పూర్తిగా నశించిపోతున్నదీ శరీరం. ఇలాంటి పదార్థాన్ని నెత్తిన వేసుకొని అదే నేను-నేనే అది-అని తాదాత్మ్యం చెందాము మనం. దీనితో అది మారుతుంటే మనం మారుతున్నామని-అది చివరకు నశిస్తుంటే మనమే సర్వనాశనమైపోతున్నామని భావిస్తున్నాము. అలా భావిస్తే శరీర ధర్మం మన కాపాదితమై మనం నిజంగానే మరణించవలసి వస్తున్నది. ఉన్నంతకాలమూ విషాదాన్ని కూడా అనుభవించ వలసే వస్తున్నది.
Page 7