ఉంది. కాబట్టి వాడి ముఖాన్ని ఎవరూ చూడలేరు. కాని వాడు మాత్రం ఆ దూర దర్శినిలో నుంచి అక్కడ ఉన్న నలుగురినీ చక్కగా చూడ గలుగుతాడు. అది వాడి కండ్లమీదనే ఉన్నావాడి చూపుల కేమాత్రమూ అడ్డురాదు.
అట్లాగే యోగమాయ పరమేశ్వరమైన తత్త్వాన్ని ఎంత ఆవరించి నప్పటికీ ఆయన జ్ఞాన దృష్టి కది ఏ మాత్రమూ ప్రతి బంధకంకాదు. ఆయన జరిగిన దాన్ని చూడ గలడు. జరుగుతూ ఉన్న దాన్ని దర్శించ గలడు. జరగబోయే దాన్ని ఆకళించ గలడు. ఎటు వచ్చీ చుట్టూ ప్రేక్షకుల లాగా నిలబడి చూచే మన లాటి జీవుల దృష్టికే అంతా ఆగమ్య గోచరం.
ఇక్కడ మన మర్థం చేసుకోవలసింది ఒక్కటే. ఆవరణ మనేది ఈశ్వరుడికి లేదని కాదు. ఉన్నా అది ఒక దుర్భిణి లాగా ఆయన దృక్శక్తిని నిరోధించడం లేదు. పోతే జీవుడి కది దుర్భిణీ లాగా పనిచేయక పోవటం మూలాన్నే అతని దృష్టి ఎక్కడి కక్కడ నిరుద్ధమౌతున్నది. అసలా మాటకువస్తే జీవుడిదే ఆవరణం అతడీశ్వరుణ్ణి సగుణంగా చూచినంత వరకూ అతని దృష్టి సావరణ Veiled మౌతుంది. అదే నిర్గుణంగా చూచిన నాడు నిరావరణమే unveiled అవు తుంది. ఇంతకూ జీవుడి దృష్టి భేదాన్ని అనుసరించి ఏర్పడ్డవే ఆవరణమైనా అనావరణమైనా. స్వతహాగా ఈశ్వరుడి కేదీ లేదు.
44
ఇచ్చా ద్వేష సముత్తైన-ద్వంద్వ మోహేన భారత
సర్వ భూతాని సమ్మోహమ్-సర్గే యాంతి పరంతప 7-27
ఆవరణ మీశ్వరుడి దంటూనే మరలా ఈశ్వరుడి కాదోషమెంతా మాత్రమూ సోక దంటున్నారు. జీవుడిది కాదంటూనే దోషమంతా అతని మెడకే చుడు తున్నారు. రెండూ చైతన్యాలే అయినప్పుడది రెండింటికి దుర్భిణి మాదిరి పని చేయాలి గాని ఒక దాన్ని తప్పించటమేమిటి. మరొకదాన్ని బాధించట మేమిటని ఆక్షేపించవచ్చు.
దీనికి శాస్త్రం చెప్పే సమాధాన మిది. మన మీశ్వర స్వరూపులమే. మన చైతన్యం సర్వవ్యాపక మైనది. ఎలాంటి అవరోధం దానికి లేదని మనం భావించ గలిగితే చాలు. నిజంగా మన మీశ్వరుడే అవుతాము అప్పుడెలాంటి ఆవరణ దోషమూ లేదు మనకు. అయితే అలా భావించే అదృష్టానికి మనం నోచు
Page 56