అది. అయినా అది ప్రసరించకుండా యోగ మాయ దాన్ని మభ్య పెడుతున్నది. దాన్ని అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని. అదే మన బుద్ధి కుండే గ్రహణ శక్తిని కూడా కుంఠితం చేస్తూంది.
అటు గ్రాహ్యమైన తత్త్వమూ ఇటు గ్రాహకమైన మన జ్ఞానమూ రెండూ దానిచేత ఎప్పుడావృత మయ్యాయో అప్పు డీజ్ఞానమనే సాధనం మనకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దానితో పరమార్ధాన్ని గ్రహించలేని మూఢుల మయ్యాము మనమంతా. అయితే పరమార్ధం మాత్రం మనం గ్రహించినా గ్రహించకున్నా అలాగే ప్రకాశిస్తూ ఉంది. ఎంచేత. అది అజమూ అవ్యయమూ అయిన పదార్థం. కారణమనేది లేనిది కాబట్టి అది అజం. దేనికి కార్యం కాదు కాబట్టి అవ్యయం. అంచేత మరొకదాని కది ఎప్పుడూ వశం కాదు. మాయ కూడా దానికి భిన్నం కాదు కాబట్టి దాని నేమీ చేయలేదు. ఎటువచ్చీ జీవుడికే అది అడ్డు తగులుతూ వుంది. కనుకనే ఎదుటనే ఉన్నా దాన్ని చూ కలేక బాధ పడుతున్నాడీ జీవుడు.
43
వేదాహం సమ తీతాని - వర్త మానాని చార్జున
భవిష్యాణీచ భూతాని - మాంతు వేద నకశ్చన 7-26
ఇదేమిటే అన్యాయం. మాయా శక్తి జీవేశ్వరుల నిద్దరినీ కమ్ముతూ ఉందని గదా పేర్కొన్నారు. అందులోనూ అది ఈశ్వరుడికి చెందినదే కదా ఆ మాయ, ఈశ్వరుణ్ణి ఆవరిస్తూ గదా అది జీవుడి దృష్టిని కూడా మభ్య పరచటం. అలాం టప్పు డీశ్వరుడి కది హాని చేయక పోవటమేమిటి. జీవుడే దాని బారికి చిక్కట మేమిటని ప్రశ్న వస్తుంది.
నిజమే, ఈశ్వరుడినీ అది బాధించ వలసిందే. కానీ బాధించే స్తోమత లేదు దానికి. కారణం అది ఈశ్వర తత్త్వాని కంటే భిన్నమైన పదార్థం కాదు. ఈశ్వర ప్రకృతే అది ప్రకృతి అంటే స్వభావం. తన స్వభావం తన కెప్పుడూ హాని చేయదు. ఇంతెందుకు. అగ్నికి ఉష్ణత అనేది స్వభావం. అది దేనినైనా నిమి షంలో దహించి వేస్తుంది. కాని అగ్ని నేమీ చేయలేదది.
ఇంకా ఒక దృష్టాంతం కూడా చెప్పుకో వచ్చు ఇక్కడ. ఒకడొక పెద్ద దుర్భిణీ పెట్టుకొని దూరం నుంచి అందరినీ చూస్తుంటాడు. దుర్భిణీ వాడి కండ్ల కడ్డంగా
Page 55