#


Back

అయితే ఇది వాడి సౌకర్యం కోసం చేసుకొన్న కల్పనే కాని వాస్తవం కాదు. కారణ మేమంటే అది అవ్యయం. పరిణమించే స్వభావం దానికి లేదు అనుత్తమ మని దానికీ పేరు. ఉత్తమం కానిదేదో అదీ అనుత్తమం. అంతకన్నా గొప్ప పదార్థమేదీ లేదు. అది అన్నింటికీ మూల కారణమని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడిక దానిని మించిన తత్త్వమెలా ఉండగలదు. కనుకనే దానిని కూటస్థ Constant మన్నారు. అది ఎలా ఉంటే అలా భావించటమే మన విధి. అంతేగాని ఒక విధంగా ఉంటే మరొక విధంగా చూడటం గాదు. చూస్తే తత్త్వానికి దూరమైపోతామే గాని దాని కెన్నటికీ సన్నిహితులం కాము. కాలేము. ఇంతకన్నా తెలివి తక్కువ ఏముంది.

42
నాహం ప్రకాశ స్సర్వస్య - యోగ మాయా సమావృతః
మూఢయం నాభిజానాతి - మా మేభ్యః పరమవ్యయం    7-25

అయితే ఇక్కడ ఒక ఆశంక వస్తుంది. జీవేశ్వరు లిద్దరూ చైతన్య స్వరూ పులే. చైతన్యం తప్ప మరొక లక్షణం ఇద్దరిలోనూ లేదని సిద్ధాంతం చేశారు. మహా అయితే జీవ చైతన్య మీశ్వర చైతన్యం కన్నా స్వల్పమైన దైతే కావచ్చు. అది పరిమాణంలోనే గాని వస్తు తత్త్వంలో కాదు గదా. అలాంటప్పుడిది దాని సర్థం చేసుకోలేని దుస్థితి అసలు ఎలా సంభవించిందని ప్రశ్న.

వాస్తవమే. ఎంత స్వల్నమైనా చైతన్యమే గనుక అది సజాతీయమైన ఆ ఈశ్వర తత్తాన్ని గ్రహించి వుడవలసిందే. సందేహం లేదు కాని ఇక్కడ వచ్చిన తిరకాసే మంటే అది దీని పరిధిలోకి రాకుండా మరుగు పడి వుంది. ఏదైనా ఎదట పడితే గ్రహిస్తుందే గాని మరుగు పడితే ఎలా గ్రహించగలదు. అక్కడే పున్నా పట్టుకోలేదు. ప్రస్తుత మీశ్వర చైతన్య మంతటా నిండివున్నా మరుగున పడి జీవుని కేమాత్రమూ గోచరం కావడం లేదు.

అంతటా ఉన్న దెలా మరుగయిందని ప్రశ్న. దాని చుట్టూ యోగమాయ అనే దట్టమైన పొర ఒకటి ఆవరించి వుంది. అది నిత్యమూ అడ్డు తగులుతూ ఉంది లోక దృష్టికి. అందుకే ఎవడంటే వాడు దాన్ని అంత సులభంగా గ్రహించ లేక పోతున్నాడు. గ్రహించే సాధనం మన దగ్గర లేక గాదు. జ్ఞానమే గదా గ్రహించే సాధనం. అది ఎప్పుడూ మన దగ్గర ఉన్నదే. అసలు మన స్వరూపమే

Page 54