సచ్చిత్తులనేవి లోకంలో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తాయి మనకు. నీవూ నేనూ చూచే ప్రతి పదార్ధమూ సత్తే చిత్తే. ప్రతి ఒక్కటీ ఉందనే చూస్తున్నాము. కనిపిస్తున్నదనే చెబుతున్నాము. ఏదీ లేదనీ కనిపించటంలేదనీ వాకొనలేము. లేకుండా కనిపించకుండా పోయిన పదార్థాన్ని గూర్చి నీవు మాటాడలేవు సరిగదా అసలా లోచించను గూడాలేవు. అది సృష్టిలో అసంభవం. కాబట్టి ప్రపంచాన్ని చూస్తున్నా మంటేనే అది సచ్చిదాత్మకంగానే కనిపిస్తున్నది. ఈ సచ్చిత్తులే పరమాత్మ అని పేర్కొన్నాము ఇక ఈశ్వరుడు లేడని వాదించడం దేనికి. ఎంత నాస్తికుడు కూడా ప్రపంచం లేదని చెప్పలేడు గదా. ప్రపంచం లేదన లేదంటే అప్పటి కీశ్వరుణ్ణి కూడా లేదనటం పొసగదు.
ఒకవేళ నామ రూపాత్మకమైన ప్రపంచాన్నే అంగీకరిస్తాము-మీరు చెప్పే సచ్చిత్తుల సంగీకరించమంటారా. సచ్చిత్తు లెత్తిన అవతారాలే ఆ నామ రూపా లని మా సమాధానం. నీవు నామ మనేది దాని నామమే. నీవు రూపమనేది దాని రూపమే దాని విభూతే Expansion ఈ చరా చరప్రపంచమంతా. ఒక మృత్తికవిభూతే ఘటశరావోదంచనాదులయినట్టు - ఒక సువర్ణ విభూతే కటక కుండలకేయూరాదు లయినట్టు- ఇదంతా దాని విభూతే "రసోహ మప్సు కౌంతేయ సర్వతః పాణి పాదమ్ తత్ మయాతత మిదమ్ సర్వమ్ - మత్తః పరతరమ్ నాస్తి-అని భగవానుడే సెలవిస్తాడు.
అంచేత నాస్తికుడు మొదలు కొనీ-మహాయోగి వరకూ ప్రతి ఒక్క మానవుడూ ఆతత్వాన్ని భజించే వాడే వాస్తవంలో. అయితే ఆ భజించటంలో ఒక్కొక్కరి దొక్కొక్క దృష్టి విశేషమయి ఉండవచ్చు. అంత మాత్రమే తేడా అసలు లేదనే అభావ దృష్టి ఒకడిదైతే అంతా నా స్వరూప మనే సర్వాత్మ భావ దృష్టి వేరొకడిది. పోతే ఈ ఇద్దరిమధ్యలో ఉన్నారు మిగతా మానవులంతా అందులో విగ్రహ రూపంగా భజించే వారు కొదరూ-జ్యోతిః స్వరూపంగా చూసేవారు కొందరూ-మంత్రరూపమైన శబ్దంగా భావించే వారు కొందరూ-శూన్యంగా దర్శించేవారు కొందరూ ఒకటిగాదు రెండుగాదు. పరశ్శతంగా ఉంటాయి. వారి వారి ప్రపత్తి మార్గాలు. అధికారి భేధమనేది ఒకటి ఉంది గదా. మరి వారి Approachలో వైవిధ్యమెలా లేకపోతుంది.
అయితే ఇక్కడ చిత్ర మేమంటే లోకంలో ఎవరా పరమాత్మ నెలా భావిస్తే వారి నా ఈశ్వరు డలాగే చూస్తాడని చెప్పటం. నాస్తికుల కాతత్త్వం నాస్తికంగానే
Page 47