#


Back

వారే జ్ఞానులు. తత్త్వాన్ని గ్రహించి తదేక నిష్టతో జీవితాన్ని గడిపే మహనీయులు వీరు. శుక శౌనకాదులందరూ ఇలాంటివారే. నలుగురిలో మొదటి ఇద్దరూ ముముక్షువులు. మూడవవారు సాధకులు. నాల్గవవారు సిద్ధపురుషులూనని మన మర్థం చేసుకోవలసి ఉంటుంది.

33
యే యథామామ్ ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్
మమ వర్మాను వర్తంతే - మనుష్యాః పార్థ సర్వశః    4-11

అసలు రహస్య మేమంటే ఎవరు నన్నెలా భజిస్తారో నేను కూడా వారి సలాగే భజిస్తుంటాను. ఎలా భజిస్తారో అని చెప్పటంలో ఎంతైనా ఉంది భావం. దేవుడెక్కడ ఉన్నాడు-లేడు పొమ్మని-వాదించే పరమ నాస్తికుడి దగ్గరి నుంచీ ఎక్కడబడితే అక్కడ ఉన్నాడది మన స్వరూపమేనని అనుభవానికి తెచ్చుకొనే మహాజ్ఞాని వరకూ అందరూ ఆ పరమాత్మను భజిస్తున్నవారే. అందుకే మానవు లంతా ఏదో ఒక విధంగా చివరకునా మార్గాన్నే అనుసరిస్తున్నారని నిర్భయంగా చాటుతున్నాడు భగవానుడు.

అందరూ ఆయన మార్గాన్నే అనుసరించట మేమిటి. నాస్తికులూ Atheists అజ్ఞేయ వాదులూ Agnostics హేతువాదులూ Rationalists వందలు వేలు న్నారు గదా లోకంలో. వారెవరూ ఈశ్వరాస్తిత్వాన్ని ఒప్పుకోరు గదా అని ప్రశ్నరా వచ్చు. ఒప్పుకోనట్టు పైకి కనిపిస్తున్నా ఒక విధంగా వారూ భజిస్తూనే ఉన్నారా పరమాత్మను. ఎలాగంటే మనుష్య మానవ అనే మాటలకు మనన శీలుడని అర్థం. మననమంటే ఆలోచన. భగవంతుడున్నాడని చెప్పేవాడి కాభావాన్ని గూర్చిన స్ఫురణ ఎలా ఉందో లేడని వాదించే వాడికి అలాగే ఉంది. లేడని ఒకడు వాచా అంటున్నాడంటే మనసా దాన్ని గూర్చిన ఒక స్పృహ Awareness ఉంటే గదా అంటాడు. అది ఎంత అస్పష్టమైన దైనా కావచ్చు. అయినా ఆ పదార్థానికి చెందినదే ఆ ఆలోచన.

అయితే వాడు బొత్తిగా లేడని చాటుతున్నాడు గదా- అది ఒప్పుకొట మెలా అవుతుందని ఆడగవచ్చు. వాడొక వేళ లేదన్నా అది సర్వత్రా ఉండనే ఉంది. భగవంతుడనే వాడికి కాళ్ళూ చేతులూ కళ్ళూ చెవులూ- ఉన్నాయంటే గదా నీకు బాధ. కేవలం సచ్చిత్తులనే భావాన్నే మేము భగవంతుడని చెప్పటం. ఈ

Page 46