#


Back

కనిపిస్తుంది. అజ్ఞేయ వాదుల కజేయంగానే ఉండిపోతుంది. హేతువాదులకు హేతురూపమే అది. పోతే ఆస్తికులలో ఆర్తులైన వారి ఆర్తిహరణ చేసి కాపాడు తుంది. అలా కాపాడకనే పోతే ఇన్ని మొక్కుబళ్ళూ- ఇన్ని సేవలూ- ఇన్ని ఉత్సవాలూ చేయనక్కరలేదు. ఫలితముండకపోతే మానవుడేపనీ చేయడుగదా. కాబట్టి ఆ పన్నులపాలిటి కాపద మొక్కులవాడా ఈశ్వరుడు మరితత్త్వ జిజ్ఞాసువు లయి ఏ ఫలమూ కోరనివారి కాయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆర్ధార్ధుల కర్ణాన్ని ప్రసాదిస్తాడు. పోతే జ్ఞానులైన వారికి జ్ఞాననిష్ఠ నిస్తాడు. నిష్ఠా పరులకు మోక్ష ఫలాన్నే అందజేస్తాడు. మొత్తానికందరినీ అన్నివిధాలా అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎవరినీ ఉపేక్షించడు.

మరి ఇన్ని విధాల అనుగ్రహించటాని కిందరు దేవుళ్ళు లేరుగదా అని ఆశంక చేయరాదు. స్వరూపతః ఆయన ఏకమైనా విభూతితః అనేకం. నిరాకార మైనా సాకారం. అవ్యక్తమైనా వ్యక్తం. నచేతనమైనా అచేతనం. "నచ్చ త్వచ్చ భవ" తంటున్నది శాస్త్రం. కాబట్టి ఆ భావం దగ్గరినుంచి భావందాకా ఏ రూప మైనా ధరించగలడు. సాధకుల నెట్లాగైనా అనుగ్రహించగలడు. సందేహం లేదు. అయితే మన దృష్టినిబట్టే మన సాధన. మన సాధనను బట్టే ఆయన ఇచ్చే ఫలమనే సత్యాన్ని మరచిపోరాదు.

34
తేషాం జ్ఞానీ నిత్య యుక్తః- ఏక భక్తి ర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినో త్యర్ధ- మహం సచ మమ ప్రియః    7-17

మొత్తానికి నాస్తికుల నొకరిని మినహా యిస్తే మిగతా మానవులంతా నాలుగే నాలు గంతస్తులు. వారే ఆర్తాదులు. ఆ ఆర్తాదులు నలుగురిలోనూ జ్ఞానికున్న అంతస్తు చాలా ఉన్నతమైనది. పరమాత్మ స్థాయికీ అతని స్థాయికీ ఏమాత్రం తేడా లేదు. పరిపూర్ణ చైతన్య రూపమే గదా పరమాత్మ అంటే. అలాంటి పరి పూర్ణతనే అందుకొన్నాడు జ్ఞాని కూడ, అందుకే పరమాత్మ అంటే అతని కిష్టం, అతడంటే పరమాత్మకూ ఇష్టం.

అంతేగాదు. పరిపూర్ణమైన జ్ఞాన మప్పుడయిందో అప్పుడదే భక్తీ అవు తుంది. అదే కర్మా అవుతుంది. భజించటమే భక్తి. చేయటమే యుక్తి. జ్ఞాని సమత్వ బుద్ది సంపన్నుడు కాబట్టి ఒకవైపు పరమార్ధాన్ని భజిస్తూనే మరొకవైపు దాని బలంతో కర్మ లాచరిస్తాడు. లేదా కర్మ లాచరిస్తూనే పరమాత్మను సేవిస్తుం

Page 48