#


Back

దీనివల్ల మనకు తేలిందేమిటి. అంతా మనం చేసుకొన్నదే మనమనుభవిస్తు న్నాము. మన మేమిటి అని అడిగావో అది విచారణ అవుతుంది. విచారణ సాగించా మంటే చివర కేదీ లేదు. అంతా ఆత్మ చైతన్యమేనని తేలుతుంది. కాబట్టి అవిచారితంగా అనుభవిస్తున్న వరకే ఈ జీవ భావం. ముందు వెనుక లాలోచిస్తే చాలు ఎగిరి పోతుంది. రజ్జు నర్పం లాంటిది దాని ఆస్తిత్వం. సర్ప మని భ్రాంతి పడి చూచినంత వరకే అది. ఏమిటి నేను చూస్తున్నది సర్పమేనా అని ఏ మాత్రం నిగా పెట్టినా సర్పం పరారయి రజ్జువే మిగులుతుంది. అలాగే ఏమిటీ జీవ భావం - ఇది చైతన్యమే కదా - చైతన్య మనేది ఎప్పుడూ ఆకాశం లాగా ఒక ఆఖండమైన తత్త్వమే కదా- అని వివేచన చేస్తే చాలు. కర్మలేదు. మోహం లేదు. అసురత్వమూ లేదు. ఏదీ లేదు. అంతా హుళక్కే. కాబట్టి ఆత్మ విచారమే అన్నింటికీ పరిష్కారం.

32
చతుర్విధా భజంతేమాం జనా స్సుకృతినోర్జున

ఆర్తో జిజ్ఞాసు రర్ధార్థీ-జ్ఞానీ చ భర తర్షభ    7-16

కానీ ఈ విచారణ మాత్రం చేయగలమా అని ప్రశ్న. ఎంచేతనంటే విచారణ అనేది బుద్ధికి సంబంధించిన విషయం. బుద్ధి పురాకృత కర్మఫలం. బుద్ధిః కర్మాను సారిణీ. అని గదా పెద్దలు చెప్పిన మాట. కర్మ వల్ల ఏర్పడిన బుద్దికి కర్మ వ్యూహాన్ని భేదించుకొని పోయే శక్తి ఎక్కడిది. మరి విచారణ అంటే అలాంటి ప్రయత్నమే కదా. కాబట్టి అది కూడా ఒక గొంతెమ్మ కోరికే గాని వాస్తవంలో ఎంత మాత్రమూ సంభవం కాదని తోస్తుంది.

తోచటం సహజమే. కానీ కర్మ అనగానే మనం బెదరి పోగూడదు. సర్వ శక్తులూ అది గుత్తకు తీసుకొన్నదని భ్రాంతి పడరాదు. కర్మలనేవి రెండు రకాలు. ఒకటి దుష్కృతం. మరి ఒకటి సుకృతం. రెండూ కలిసి మన జన్మకు నిమిత్త మవుతాయి. ఇందులో కూడా ఒక సూక్ష్మ మున్నది. మరీ మొద్దులయితే చెప్ప లేముగాని కొత్త ఆలోచనా పరులైన మానవుల కందరికీ రెండు బుద్దు లుంటాయి. ఒకటి ప్రాపంచిక విషయాల మీదికి పరుగెత్తేది. మరొకటి పార మార్థికాన్ని పట్టుకొనేది. ఇందులో మొదటిదానికి మన దుష్కృతం కారణమైతే రెండవ దానికి సుకృతకర్మ కారణ మవుతుంది.

Page 44