#


Back

కూడా తగ్గించు కోవాలి మనమదే పనిగా. అసలే వాటిని చేయకూడదని కాదు. చేస్తే అర్థం ప్రాణం ధారబోసి చేయటమూ కాదు. ఎంత వరకో అంత వరకే. ఎంత సుఖంగా ప్రవేశిస్తామో అందులో అంత సుఖంగా బయట పడగల గాలి. లేకుంటే మనస్సు దానిలో బాగా లగ్నమై తన బలాన్ని కోల్పోతుంది. అన్నింటి కన్నా ముఖ్యం నిద్రా-మెలకువా. అతి నిద్రా పనికి రాదు. అతి జాగ్రత్త పనికిరాదు. మొదటిది అభ్యాసానికి దెబ్బయితే రెండవది వైరాగ్యానికి దెబ్బ. కాబట్టి వాటిని కూడా సాధకుడు అదుపులో పెట్టుకోవాలి.

ఇలా నిగ్రహం పాటిస్తూపోతే అది మనోదార్ధ్యానికి క్రమంగా దారి తీస్తుంది. మనసు దృఢమైతే ఇక యోగం మనకు నిలిచిందన్న మాటే. లేకపోతే యోగమని మాటలు చెప్పడమే గాని అది మనకెప్పుడూ దక్కేదిలేదు. అనుభవానికి వచ్చేది లేదు.

21
అయతిః శ్రద్ధయోపేతో - యోగాచ్ఛలిత మానసః
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి   6-37

సమత్వ రూపమైన యోగాని కెప్పుడూ సాధకుడు యత్నం చేయాలని చెప్పాము. ఈ యత్నమనే మాట వినేటప్పటికి ఒక సందేహ మేర్పడుతుంది. మనకు. యత్న మనేది అందరూ చేయలేరు మానవులలో ఏ కొందరో దానికి అధికారులు. (Competent కాని అధికారం లేకున్నా శ్రద్ధాభక్తులున్న వ్యక్తు అనేకులున్నారు లోకంలో. అడపా దడపా కొంత యత్నం కూడా చేయకపోరు. అయితే అది తీవ్రమైన యత్నం కాకపోవచ్చు. అంత బలమైన యత్నం కాక పోవటం మూలాన యోగమార్గంలో వారికి మాటి మాటికీ మనసు చలించటం కూడా సహజమే. అలాగే జీవితాంతమూ చలిస్తూపోతే ఇక వాడి గతేమిటి. సిద్ధి అనేది ఎప్పుడు అని ప్రశ్న.

నిజంలో యోగం సిద్దించని వాడి గతేమిటని అడగ సక్కరలేదు. వాడిగతి అధోగతేనని ఊరకనే చెప్పవచ్చు, కాని ఇక్కడ సూక్ష్మ మేమంటే వాడికి 0 ప్రయత్నం లేదేగాని శ్రద్ధ ఉన్నది. శ్రద్ద అనేది కూడా ఒక గొప్ప గుణమే. అది ఉన్నప్పుడేదో ఒక మంచిగతి రావాలే గాని అధోగతి పాలు కాగూడదు. మానవుడు.

Page 33