అట్లాగే జ్ఞానం కూడ గొప్పకాదు. జ్ఞానం కాకపోవడమేమిటి - అదే గదా తత్త్వాన్ని సాధించటాని కేకైక సాధనం అని శంకించవచ్చు. నిజమేగాని అది కేవలం పుస్తక జ్ఞానమయితే పనికిరాడు పుస్తక జన్యమైనది అనుభవానికి రావాలి అప్పుడే అది ఆత్మదర్శనానికి సాధనమవుతుంది. అనుభవమే గదా యోగమని పేర్కొన్నాము. అంచేత ఆ స్థాయికి రాని పరోక్ష జ్ఞానమూ తగ్గు జాతిదే.
పోతే ఇక కర్మ. అది ఇంకా తక్కువ స్థాయి. కేవల మీ భౌతిక ప్రపంచం తోనే ముడిపడి ఉన్నదది. ఆత్మ స్పర్శకూడా లేదు దానికి. ఫలాపేక్ష లేకుండా చేస్తేనే అదైనా కొంత ఫలిత మిచ్చేది. ఫలాపేక్ష లేకుంటే అది యోగానికి కొంత దోహదం చేస్తుంది.
కనుక ఇంతకూ ఫలితాంశ మేమంటే తపోజ్ఞాన కర్మలనేవి ఏవి మోక్షానికి సాక్షాత్తుగా సాధనాలు కావు. అవే సమదర్శనమనే యోగంతో చేరి పనిచేస్తే సాధనాలవుతాయి అప్పుడిన్ని నామధేయా అనవసరం దానికి యోగమనే పేరొక్కటే చాలు, దాని సభ్యసించటమే సాధకుని కర్తవ్యం వాడే అందరికన్నా విశిష్టుడు.
20
యుక్తా హార విహారస్య - యుక్త చేష్టస్య కర్మసు!
యుక్త స్వప్నావ బోధస్య- యోగో భవతి దుఃఖ హా!! 6-17
ఆచరణమే యోగమని చెప్పాము. ఆచరణ అనే సరికది సాధకుడి మనో దార్థ్యాన్ని బట్టి ఉంటుంది. మనోదార్ధ్యమంటే అది ఒక్కసారిగా ఊడిపడేది కాదు. ఆహారం దగ్గర నుంచీ ఉన్నాయి దానికి పునాదులు. అవి గట్టిపడితే గాని దానిపైన నిర్మించే కట్టడం నిలవదు. ఎలా గట్టిపడాలంటారది.
మనమే పని చేసినా ఒక మోతాదు దాటి చేయరాదు. మోతాదులోనే ఉంది. సమత్వం. అది దాటితే దానికి దెబ్బతగులుతుంది. ఈ మోతాదుకే యుక్తమని పేరు పేట్టారు. ఆహారం తీసుకొంటే యుక్తంగా తీసుకోవాలి. విహరిస్తే యుక్తం గానే విహరించాలి. ఇవే సగం బలమిస్తాయి మానవుడి మనస్సుకు.
పోతే ఇక ఎన్నో ఉంటాయి మనం ప్రతి క్షణం సాగించే పనులు. ఒక ప్రసంగాలే కావు. ప్రయాణాలే కావు. విందులే కావు. వినోదాలే కావు. ఉద్యో గాలే కావు. వ్యాపారాలే కావు. ఇవన్నీ చేష్టల క్రిందికి వస్తాయి. ఈ చేష్టలు
Page 32