చాలదు. విస్ఫులింగ మాత్రంగా ఉన్నదీనినే జ్వాలారూపంగా ప్రజ్వలింపజేయాలి మనం. అలా పరిణతి చెందాలంటే దానికి మొదటి నుంచీ సంయయమనేది ఉండాలి. సంయమమంటే సంశ్లేషమనే గదా పేర్కొన్నాము. ఈ సంశ్లేష దృష్టి మానవులందరిలో ఉన్నా సమానంగా ఉండదు. కొందరిలో దాని మోతాదు తక్కువ. కొందరిలో ఎక్కువ. వారిలో వ్యక్తమైన concrete సంశ్లేషాలనే గమ నించగలరు గాని చాలామంది అవ్యక్తమైన Abstract వాటి నవగాహన చేసుకో లేరు. ఏ ఒకరిద్దరో అలా ఆకళించుకోగలరు. వారిని వశ్యాత్ములని వర్ణించారు పెద్దలు. మనస్సును కూడగట్టుకొని ఏది చూచినా అఖండంగా చూడడానికే అలవాటుపడి ఉంటారు వారు. సహజమైన శక్తి కొంత. అలవాటు కొంత. అది శక్తిని పెంచుతూపోతుంది. దానితో యోగాన్ని సాధించవచ్చు. శక్తి ఉన్నా పెంచుకోలేకపోతే అది అసంయమం అలాంటి వాడెప్పుడూ యోగానికి నోచుకోలేడు.
19
తపస్విభ్యోధికో యోగీ-జ్ఞానిభ్యశ్చ మతోధికః
కర్మభ్యశ్చాధికోయోగీ-తస్మాద్యోగీ భవార్జున 6-46
యోగమంటే సమధర్శన మని చెప్పాము. దాన్ని మన మర్థం చేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. ఆచరణలో పెట్టినప్పుడే దానికి విలువ. అస లాచరించిన వాడే యోగి. కనుకనే వాడందరికన్నా గొప్పవాడు. అందరికన్నా అంటేఎవరా అందరు.
ఒకరు తపస్వులు. వీరిని గొప్పగా చూస్తాము మనం. తపస్సు చేశారంటే ఎంతో గొప్ప అని మన నమ్మకం. నిజానికేమంత గొప్పకాదది. సాంప్రదాయి కంగా చూస్తే తపస్సనే మాటకు తపించడం- అన్న పానాదులు మాని శరీరాన్ని శుష్కింప చేసుకోవటం అని అర్థం. కృచ్ఛ చాంద్రాయణాదులైన వ్రతాలన్నీ ఇలాంటివే. వీటివల్ల మనో మాలిన్యం పోతుందనేది వట్టిమాట ఇంకా ఎక్కువవు తుందేమో కూడా. అందుకే గదా రాక్షసులు ఎంతో ఘోరమైన తపస్సుచేసి కూడ వారికి రాగద్వేషాలు నశించనిది. మహర్షులు కూడ కొంతమంది తపస్సంపన్నులైన వారు తమదారి కడ్డు తగిలిన వారి నందరినీ శపించటం మానలేదు. దీనినిబట్టి తపస్సనేది యాంత్రికమైన ఒక పరిశ్రమలాంటిదే గాని మరేమీ కాదు.
Page 31