#


Back

అలాకాక అదేమిటి-ఇదేమిటి-అని విశ్లేషణ చేసి చూచామంటే చాలు. అదే కొమ్మలు రెమ్మలుగా-పూవులుగా కాయలుగా-గోచరిస్తుంది. చెట్టనే దృష్టితో చూచినప్పుడీ విభాగాలన్నీ అక్కడే ఉన్నా గోచరం కావు. విభాగదృష్టితో చూచి నప్పుడు చెట్టు అనే అఖండ రూపం మనసుకు రాదు. ఒకటి మగ్నమైతే merged ఇంకొకటి ఉన్మగ్న Emerged మవుతుంది. మొత్తంమీద రెండు శక్తులూ సహజంగానే ఉన్నాయి మానవుని మనస్సుకు. ఏ సందర్భంలోనయినా సరే. రెండు శక్తులూ ఏదో ఒక మోతాదులో పనిచేస్తూనే ఉంటాయి. ఒక దానిని విడిచి మరి ఒకటి ఉండదు. అలా ఉండేట్టయితే మన మనో నేత్రాని కెప్పుడూ పరమాత్మ అయినా కనిపించాలి. లేదా ఎప్పుడూ పరమాణువులయినా కని పించాలి. ఎందుచేతనంటే ఒకటి కేవల సంశ్లేషం. వేరొకటి కేవల విశ్లేషం. అయితే మనకలా కనిపించటంలేదు. దీనినిబట్టి మన ప్రతి ఒక్క అనుభవం లోనూ రెండూ కలిసే పనిచేస్తుంటాయని తార్కాణమవుతుంది.

అలాంటప్పు డీరెండు శక్తులలో ఒకదానిని తొంబది తొమ్మిది శాతం దాకా పెంచుకుంటూ పోగలిగితే మరొకటి కేవలం ఒక్క శాతమే కాబట్టి బాగా దుర్బలమై పోతుంది. అప్పుడది ఉన్నా మనకు ప్రమాదంలేదు. అసలే లయం కావడంలేదు కాబట్టి రెండూ అవినాభావంగా ఉండాలనే సూత్రానికి అపవాదం లేదు. అలాగే ఉన్నప్పటికీ దుర్బలం కాబట్టి దాని ఉనికివల్ల మనకు భయంలేదు.

అయితే ఇందులో ఏది తగ్గించుకోవాలి. ఏది హెచ్చించుకోవాలని ప్రశ్న తగ్గించుకోవలసింది విశ్లేష దృష్టి, ఎందుకంటే అదే వైషమ్యానికి కారణం. దానికి భిన్నంగా సామ్యానికి కారణం కాబట్టి సంశ్లేష దృష్టిని హెచ్చించుకోవలసి ఉంది. సంశ్లేష దృష్టిని పెంచుకుంటూ పోతే చివరకంతా చైతన్యమే ననే భావనకు తీసుకుపోతుంది. అప్పుడు మనసు తొంబది తొమ్మిదిపాళ్లు సంశ్లేష స్థితిలోనే ఉంటుంది. అప్పటికి ఒక్క భాగం విశ్లేష మనేది లేకుండా పోదని చెప్పాము. అయితే అది ఒక బిందు రూపంగా మారి చాలా బలహీనమవుతుంది. కాబట్టి చైతన్యాన్ని ఏమాత్రమూ బాధించలేదు. మీదు మిక్కిలి దానికే అధీనమై దాని ఇచ్ఛానుసారంగా ప్రవర్తించే శక్తిగా మారుతుంది. దీనినే అవ్యక్తమనీ- ప్రకృతి అనీ - మాయ అనీ - Cosmic power పేర్కొంటారు వేదాంతులు.

మొత్తంమీద ఇక్కడ ఉన్న పెద్ద షరతేమంటే నిరంతరమూ సంశ్లేష దృష్టినే పెంచుకుంటూ పోవటం. కొంతవరకూ ఇప్పుడే మనకున్నదది. అయితే అది

Page 30