అయితే అది ఏమిటి- ఎలా ఉంటుందనే విషయం మనంనిర్ణయించేది గాదు. మనమంతా నరులం. నరుడికి కలిగే సంశయం నారాయణుడే తీర్చ వలసి ఉంది. ఎందుకంటే వాడికి భగవంతుడని పేరు. భగమంటే షాడ్గుణాలలో "భూతానా మాగతిం గతిమ్" అని ప్రాణులు రాకపోకల రహస్యం కూడా ఇమిడి ఉంది. అలాంటి రహస్యాలన్నీ తెలిసినవాడు గనుకనే వాడు భగవంతుడు. వాడే కృష్ణ రూపంగా అవతరించాడు కనుక నరుడు వేసిన ప్రశ్నకు ఆ నారాయణుడైన కృష్ణుడే సమాధానం చెప్పాలి. మరొక్కడి కలాంటి అధికారం లేదు. అందులోనూ అతీంద్రియమైన విషయంలో.
22
పార్థ నై వేహ నాముత్ర-వినాశస్తస్య విద్యతే
సహి కల్యాణకృత్ కశ్చిత్ -దుర్గతిం తాత గచ్ఛతి 6-40
చెబుతున్నాడు సమాధానం శ్రీకృష్ణ భగవానుడు. ఎంత అభ్యాస పాటవం లేకపోయినా శ్రద్దా వంతుడైన వాడెప్పటికీ దెబ్బతినడు. ఇహం లోనూ వరం లోనూ ఎక్కడా వాడికి వినాశనం లేదు. కాకపోయినా పాడైపోవటానికి వాడేమి దుర్మార్గం చేశాడని. ప్రయత్న మెక్కువగా చేయలేడంత మాత్రమే. అయినా శ్రద్ధ అనేదొక్కటి ఉంది గదా. శ్రద్ద దైప గుణాలలో ఒకటిగా పరిగణించబడింది. అది అన్ని సిద్ధులకూ మూలం. అసలు శ్రద్ద ఉన్నవాడు ప్రయత్నం కూడ చేయకు పోడు. అయితే తగినంత బలంగా చేయకపోవచ్చు. అంత మాత్రాన మోసం లేదు చేసినంత వరకూ అది మంచిపనే. మరి మంచి చేసిన వాడెన్నటికీ వంచితుడు కాడు. అధోగతి కంత కన్నా పోడు. ఇది ముమ్మాటికీ సత్యం.
23
ప్రాప్య పుణ్య కృతాం లోకా-నుషిత్వా శాశ్వతీ స్సమాః
శుచీనాం శ్రీ మతాం గేహే-యోగ భ్రష్టోభి జాయతే 6-41
అంతేగాదు. ఎలాంటి గతి పొందుతాడని గదా అడిగావు వాడు చచ్చిన తరువాత పుణ్యలోకాలకు పోతాడు. అక్కడ చాలా కాలం సుఖంగా బ్రతుకు తాడు. అది సమాప్తం కాగానే మరలా ఈ లోకంలో వచ్చి జన్మిస్తాడు. అది కూడా ఎక్కడో పనికిరాని చోట గాదు. శుచీ శుభ్రతా ఉండే కుటుంబంలోనూ జన్మిస్తాడు.
Page 34