అభ్యాస మేమిటి వైరాగ్యమేమిటి. ఆత్మ స్వరూపాన్ని పట్టుకోవటం అభ్యాసం. అనాత్మ స్వరూపాలను త్రోసివేయటం వైరాగ్యం. వీటిలో ఏది ముందు ఏది వెనక అనే ప్రశ్నలేదు. రెండూ ఏక కాలంలో అభ్యసిస్తూ "వాలి లోకంలో ఒక సామెత ఉంది. పెండ్లి అయితేగాని పిచ్చి కుదరడు
పిచ్చి కుదిరితేగాని పెళ్ళి కాదు అని. అది పరిష్కారం కావాలంటే ఏమిటి ఉపాయం. పిచ్చికి మందు ఇప్పిస్తూ ఉండాలి. పెండ్లికి సంబంధం చూస్తూ ఉండాలి. రెండూ కలిసి ఒక కొలికికి వస్తే పిచ్చి కుదురుతుంది. పెండ్లీ జరుగుతుంది.
అట్లాగే పిచ్చిలాంటి ఈ సంసారబంధం తొలగి పెండ్లి లాంటి జీవ బ్రహ్మైక్యం సాధించాలంటే మన మా రెండింటినీ ఒకేసారి పట్టుకోవాలి. అంటే ఏమన్నమాట. ప్రపంచానికంతా మూలభూతమైన తత్త్వాన్ని అనుసంధానం చేసుకుంటూ దానిలో ఈ నామ రూప ప్రపంచాన్ని వైరాగ్య భావంతో ప్రవి లయం చేస్తూ రావాలి. అప్పుడు అద్వితీయమూ ఆత్మ స్వరూపమూ అయిన చైతన్యమొక్కటే మన మనస్సు నావరిస్తుంది. దానితో మన మనసుకు ఉండే చాపల్యం ఎగిరిపోయి అది అమనస్కమవుతుంది.
శాస్త్రీయంగా చూచినప్పటికీ అసలు అభ్యాస వైరాగ్యాలకు విలక్షణంగా మరొక సాధనే లేదనిపిస్తుంది. ఎందు చేతనంటే ఈ సంసార మనేది మనకు అనాది సిద్ధమైన అజ్ఞానం వల్ల ఏర్పడిందే. ఇదంతా నా స్వరూపమని తెలియక పోవటమే అజ్ఞానమంటే. ఈ అజ్ఞానానికి కొండ చిలవకులాగా రెండు ముఖా లున్నాయి. ఒకటి ఆవరణం Contraction. మరొకటి విక్షేపం Distraction. ఆవరణమనే ముఖంతో అది సత్యమైన ఆత్మను కప్పి పుచ్చింది. విక్షేప ముఖంతో అసత్యమైన ప్రపంచాన్ని బయట పెట్టింది. అదీ జరిగిన పెద్ద మోసం.
ఇప్పుడీ మోసాన్ని భేదించాలంటే సాధకుడైన వాడేమి చేయాలని ప్రశ్న. ఆవరణ విక్షేపాలనే రెండింటికీ రెండా హుతులు పడవేయాలి. అందులో విక్షేపానికి పడవేసే ఆహుతే వైరాగ్యం. ఎందుకంటే నామరూపాలే విక్షేపం. అవి అభిమానాన్ని రేకెత్తించి ఆకడుతున్నాయి మానవుణ్ణి. కాబట్టి వాటిని నిత్యమూ వైరాగ్య బుద్ధితో భావన చేస్తే కరిగిపోతాయి. పోతే ఇక ఆవరణకు మనం వేయగల్గిన ఆహుతి అభ్యాసం. ఆవరణ మనేదివాసనారూపంగా ఆత్మ చైతన్యాన్ని ఆవరించి ఉన్నది. చీకటి లాంటిదది. వస్తు రూపంగా లేకపోయినా ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది.
అంచేత నిత్యము స్వరూపాన్నే భావన చేస్తూ పోతే చాలు అది తేజోరూపమయిన జ్ఞానం కాబట్టి ఆవరణాత్మకమైన తమస్సును పటాపంచెలు చేస్తుంది. తన్మూలంగా అద్వితీయమైన ఆత్మ చైతన్యం ఎప్పుడూ మన కనుభవానికి వస్తుంది. ఇందులో ఉన్న రహస్య మేమంటే వైరాగ్యమనేది ప్రతిలోమ క్రియ. అది అనాత్మ జగత్తును లయం చేస్తుంది. పోతే అభ్యాసం అనులోమ క్రియ. అది ఆత్మమీదనే చూపునిలుపుతుంది. దానితో అంతా ఆత్మగానే అనుభవానికి వస్తుంది.
Page 28