16
చంచలం హి మనః కృష్ణ - ప్రమాధి బలవ దృఢం
తస్యాహంనిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ 6-34
అర్జునుడికినరుడని కూడ పేరుంది. నరుడంటే మానవుడే. మానవుడే అడుగుతున్నా డీప్రశ్న. ఏమని. మనసనేది బాగా చంచలమైనది. నిత్యమూ పారాడే స్వభావం దానిది. తంతునాగం లాగా చాలా బలమైనది. దృఢమైనది. అలాంటి రాకాసి మనసు సరికట్టమంటావు నీవు. అది గాలిని మూట గట్టటం లాంటిదని నాకు తోస్తుంది. ఎంతో కష్టపడి గాలిని మూట కడతావు. కాని ఏమి ప్రయోజనం. నీవు కట్టే లోపలే అది తప్పించుకొని పోతుంది. అలాంటిదే ఈ మనసు కూడా.
అంతేకాదు. మరి ఒక చిత్రం కూడా ఉంది ఇందులో. గాలిని మూట కట్టాలనుకునేది గాలి కాదు. మనం ఇక్కడ మనసును కట్టి వేయాలనుకొనేది మనసే అయి కూచుంది. అంచేత ఇది ఇంకా అసాధ్యమైన విషయం.
అయితే అసాధ్యమని ఊరక కూచుంటే సాధన చేయలేము. సాధన చేయక పోతే సంసారంలో నుంచి బయట పడలేము. ఏమిటీ విషయవలయం. ఎప్పటికి దీనికి పరిష్కారమని ప్రశ్న.
ఆసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం| అభ్యాసేన తు కౌంతేయ - వైరాగ్యేణ చ గృహ్యతే 6-35
ఈ ప్రశ్నకు జవాబివ్వ వలసిన వాడెవ్వడు. నరుడు వేసే ప్రశ్నకు నారాయ ణుడే ఇవ్వాలి జవాబు. కనుకనే ఇస్తున్నాడు. ఏమని. నిజంగా విషవలయమే ఇది. మనసును నిగ్రహించ వలసింది మనసే అయికూచుంది. కాబట్టి అది చాలా అసాధ్యమనే విషయంలో సందేహం లేదు. అయినప్పటికి అసాధ్యమని ఊరక కూచుంటే లాభం లేదు. ప్రయత్నం చేయవలసిందే తప్పదు. ప్రయత్నిస్తే అరికట్టవచ్చు. ఏమిటి ప్రయత్నం. అది ఎలా చేయాలి అభ్యాసమనీ వైరాగ్యమనీ అది రెండు విధాలు. ఈ రెండు కలిపి ప్రయత్నిస్తే మంత్రముగ్ధమైన భుజంగం లాగా అది మనకు తప్పక వశమవుతుంది.
Page 27