#


Back

దాని వలన కలిగే వేదనా నేనే. నా రూపంతోనే నాకు సంసర్గమేర్పడుతున్నది వాస్త వానికి. అలాంటప్పుడు నాకు బాధ దేనికి, బాధపడుతున్నానంటే నన్ను చూచి నేనే బెదరిపోతున్నానని అర్థం. తన నీడ చూచి తానే ఉలిక్కిపడినట్లున్నది. రెండూ ఒకటేననీ - అదీ నా స్వరూపమేననీ భావిస్తే ఏ భయాలూ లేవు. ఇలాగే శరీరం దగ్గర నుంచీ ప్రతి ఒక్కటీ లోకంలో నా చైతన్యచ్ఛాయే నానీడే గాని వేరు గాదని ఎప్పుడూ విచారణ చేస్తూ పోవాలి. ఆ విచారణ పరిపాకానికి వచ్చిందంటే తప్పకుండా ఏర్పడుతుంది సహనం. దానితో రేపు మరణానుభవం కూడా మనకు ప్రతికూలంగా తోచదు. అదీ మన స్వరూప మేననే భావనతో జీవితం లాగా మన కనుకూలమే అవుతుంది. అయితే మరణమే లేదు వాస్తవంలో.

10
ఇహైప తైర్జిత స్సర్గ - యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా దహ్మణి తే స్థితాః   5-19

సుఖ దుఃఖాదులైన ద్వంద్వాలు సమానంగా అనుభవానికి రావటమే సామ్యం. ఇలాంటి సామ్యావస్థలో మన మనస్సెప్పుడూ నిలవగలిగితే చాలు, మనమీ సృష్టిని జయించామన్న మాటే. సృష్టిని జయించటమంటే సృష్టి రహస్యాన్ని భేదించటమే. సృష్టి రహస్యమేమిటి, ద్వంద్వ మోహమే సృష్టిలో ఉన్న రహస్యం. సర్వభూతాని సమ్మోహం సర్దేయాంతి పరం తప" అని భగవానుడే సెలవిచ్చాడు. ఈ ద్వంద్వ సంఘాతం వల్లనే సామ్యం దెబ్బతిని - వైషమ్య మేర్పడింది. అదే సృష్టికంతా మూలం.

సామ్య వైషమ్యాలనేవి మరొక మాటలో చెబితే సామాన్య విశేషాలనవచ్చు. అందులో సామాన్యమనేది జ్ఞానం. అది పదార్థాలన్నింటినీ వ్యాపించి ఉంది. కాబట్టి అదే సామాన్యమనేమాట కర్ధం. పోతే విశేషాలనేవి దానికి విలక్షణంగా కనిపించే నామరూపాలు. ఇవే అఖండంగా వ్యాపించిన జ్ఞానాన్ని జ్ఞేయ రూపంగా మనకు ప్రదర్శిస్తున్నాయి. వీటిని చూస్తున్నంత వరకూ వీటికి మూలమైన సామాన్యం మీదికి మన దృష్టి పోదు. అలా పోనంత పరకూ సృష్టికి మనం లోబడవలసిందేగాని సృష్టిని మనం లోబరచుకోలేము. విశేషాలను త్రోసి రాజని కేవలం సామాన్యాన్ని నిఘాపెట్టి చూచినప్పుడే మన దృష్టి త్రిగుణాత్మక మైన సృష్టిని దాటిపోగలదు. సామాన్యమే అసలు బ్రహ్మస్వరూపం. దానికి విశేష మనేది ఒక దోషం.

Page 17