#


Back

అభిమానమున్న వాడికే బాధ. లేనివాడికి లేదు విషయేంద్రియ సంపర్కం సాధారణమే అయినా ఒకడు మనసుకు తీసుకొన్నట్టు మరి ఒకడు తీసుకోడు. ఇంకా ఒక్కొక్కడైతే ఎంతో కష్టం కలిగించే సందర్భాలను కూడా లెక్క చేయకుండా తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళను మొద్దులనీ మొరటు వాళ్ళనీ అంటాము మనం. వచ్చీపోయి ఇలాటి మొరటు తనమే అలవరచుకోవాలి మనం అధ్యాత్మ రంగంలో కూడా. దీనికే తితిక్ష అని పేరు. తితిక్ష అంటే సహనమని అర్ధం. పిడుగు పడ్డా పర్వతం చలించదు. సహనాని కది పరాకాష్ఠ. అలాంటి సహనశక్తే అలవడితే ఈ ద్వంద్వాలనేవి ఏమీ చేయలేవు మానవుణ్ణి. అయితే అలవడటమెలాగ. అందులోనే ఉంది మర్మం. ఈ కలిగే ద్వంద్వ బాధలన్నీ నిత్యం కావు, వస్తూ పోయేవే ఇవన్నీ. నిలిచేవి కావు. నిలిచేది సద్రూపుడనైన నేనొక్కడనే. నాకు భిన్నంగా ఇది అంతా కేవల మసద్రూపమే. అంటే పట్టిదేనని గట్టి నిశ్చయంతో వుండాలి.

9
యం హి నవ్యథయ స్త్యేతే- పురుషం పురుషర్షభ
సమ దుఃఖ సుఖం ధీరమ్ - సోమృతత్వాయ కల్పతే   2-15

అలాంటి దృఢ నిశ్చయంతో ఉన్న ఎవడినైతే ఈ మాత్రా స్పర్శలు బాధిం చవో వాడికి సుఖమూ దుఃఖమూ అనే భావాలు రెండు సమానమే అవుతాయి సుఖదుఃఖాలు రెండూ సమానంగా చూడగలవాడే ధీరుడు. వాడికి మరణ మనేది కూడా సంభవించదు. అమృతత్వాన్నే చూరగొంటాడు వాడు.

అయితే ఎటు వచ్చీ అంతటి మహాయోగం పట్టాలి మానవుడికి. పట్టాలంటే దాని కొక్కటే షరతు. ద్వంద్వాలన్నీ జీవితంలో ఏ మాత్రమూ తేడా లేకుండా దర్శించటమే. అందులో ఏది ఎప్పుడు సంప్రాప్తమయినా బెదరిపోకుండా స్తిమిత మయిన మనస్సుతో అనుభవించగరిగి ఉండాలి. ఎంతో సహనముంటే గాని అది అలవడదు.

ఈ సహనశక్తి ఎలా ఏర్పడుతుంది. నా చైతన్య మొక్కటే ఉంది సర్వత్రా. అదే సత్పదార్థం. అది తప్ప మరేదీ లేదు ప్రపంచంలో శరీరాదులైతేనేమి. శీతోష్ణాదులైతే నేమి - ఇవన్నీ నిజాని కసత్తులే లేనిదే మన కున్నట్లు కనిపిస్తు న్నాయి. వాటి అస్తిత్వానికి నేనే కారణం నా జ్ఞానమే లేకపోతే అవి ప్రకాశించ లేవు. అవి నా జ్ఞానానికి రూపాంతరాలే. అగ్నిలో ఉండే ఉష్ణమూ నేనే. దాని

Page 16