#


Back

అలాంటివాడి కెంతో భక్తితో బోధించాలి ఆచార్యుడు కూడా. ఆచార్యుడి కుండ వలసిన భక్తి ఏమిటిక్కడ. ఇది మామూలు చదువు కాదు నేను చెప్పటం-జగ ద్గురు వైన పరమాత్మకు సాక్షాత్తుగా చేసే పరిచర్యే ఇది అనే- ఒక నిష్కామ నిరాడంబర చిత్త వృత్తి,

ఇలాంటి భక్తి విశ్వాసాలతో శాస్త్రాన్ని చదివించటమే గాక తదర్ధాన్ని కూడా ఉన్నదున్నట్టు బోధిస్తే చాలు. అతడి జన్మ చరితార్థ మవుతుంది. చచ్చిన తరు వాత నన్నే పొందుతాడతడు. సంశయం లేదంటున్నాడు పరమాత్మ. నన్నే పొందటమంటే ముక్తుడవు తాడని అర్ధం. అంతకు ముందు కాలేదా అని సందే హించరాదు. విముక్తశ్చ విముచ్చతే” అంతకు ముందు కూడా విముక్తుడే. జ్ఞానం వేరు ముక్తి వేరు కాదుగదా. బ్రహ్మజ్ఞాన మెప్పుడు కలిగిందో అప్పుడే ముక్తి కూడా ప్రాప్తించింది. అయితే ప్రారబ్ద కర్మ ఒకటి ఇంకా ఉంది కాబట్టి అది జీవన్ముక్తి. అవసానంలో అదికూడా తీరిపోయింది కాబట్టి ఇది విదేహముక్తి. అంటే ఇక దేహధారణ అనేది లేదని భావం.

113
అధ్యేష్యతేచ య ఇమం ధర్మ్యం సంవాద మావయోః
జ్ఞాన యజ్ఞేన తేనాహ - మిష్ట స్స్యామితి మేమతిః    18-70

ఆచార్యుడి విషయమైన తరువాత ప్రస్తుత మధ్యయనం చేసే శిష్యుడి సంగతి చెబుతున్నాడు. కృష్ణార్జును లనే నెపంతో సాగిన ఈ సంవాదం వాస్తవానికి గురుశిష్య సంవాదమే. ధర్మ్యమైన దీసంవాదం. ధర్మం తప్పనిది ధర్మ్యం. ధర్మ మంటే సాధన మార్గం. సత్యం గమ్యమైతే ధర్మమది అందుకొనే మార్గమవు తుంది. అందుకే “ధర్మం చర" అన్నారు. మార్గమనే దెప్పుడూ చరించటానికే గదా. అయితే అది గ్రుడ్డిగా పట్టుకొని పోతే ప్రయోజనం లేదు. అధ్యయనం చేసి పట్టుకోవాలి. అధ్యయన మేమిటి. గురు ముఖంగా చిన్న శాస్త్రార్ధాన్ని శ్రవణం చేసి చక్కగా గ్రహించట మని అర్ధం.

అలా గ్రహించి తదను గుణమైన సాధన చేసే పెద్దమనిషి ఇక ఏ యజ్ఞాలూ యాగాలూ చేయనక్కర లేదు జీవితంలో. జ్ఞాన యజ్ఞ మనేది ఒకటి చేస్తే చాలు, అన్నీ చేసినట్టే. జ్ఞాన మేమిటి. యజ్ఞ మేమిటి. యజ్ఞ మనేది లోకంలో నాలుగు విధాలు. ఒకటి విధి యజ్ఞం ఋత్విక్కులూ - యజమానుడూ-అగ్నులూ- సమిధులూ. ఇలాంటి కలాపంతో సాగే బాహ్యమైన అనుష్ఠానం. దీనినే మనం

Page 129