#


Back

మనేది మొదట ఉంటేగాని వినేబుద్ధి పుట్టదు. వింటేగాని దానిపైన గౌరవ మేర్పడదు. గౌరవమేర్పడితేగాని దానిని నిశింతగా ఆలోచించి పట్టుకోలేడు.

దీనిని బట్టి మనం గ్రహించవలసిం దేమంటే ఇవి నాలుగూ కలిసి ఉంటేనే అధికారం Competence. ఏ ఒక్కటి లోపించినా ఆమేర కది కుంటుపడుతుంది. అంతే కాదు. నాలు గింటిలో ఉత్తరోత్తరం చాలా అవశ్యకమైన గుణం. అంటే తపస్సు కన్నా భక్తి - భక్తి కన్నా శుశ్రూష- దాని కన్నా అనసూయ-ముఖ్యమైన యోగ్యత. శుశ్రూష-భక్తీ ఉంటేనే తపస్వికి చెప్పవలసింది. అవి లేకుండా తపస్వి అయినా చెప్పకూడదు. అసూయా యుక్తుడయితే ఇక ఎన్ని గుణాలున్నా పనికిరాదు. అది లేకుండా కనీసం భక్తి శుశ్రూష లున్నా చాలు పనికి వస్తుంది. ఇదీ శాస్త్ర సంప్రదాయ విధి. దీనిని బట్టి తెలిని తేటలు గాదీ మార్గంలో ముఖ్యం. ముఖ్యంగా కావలసింది విశ్వాసం. దానితో పాటు గౌరవం- గౌరవ బుద్ధితో చేసే శ్రవణం. ఇవి మూడూ ఉన్నప్పుడే మానవుడి తెలివి సరియైన మార్గంలో ప్రవేశించి రాణిస్తుంది. లేకుంటే పెడత్రోవ బట్టి ఊరక పాడయి పోతుందని శాస్త్ర హృదయం.

112
య ఇమం పరమం గుహ్యం
మద్భక్తేష్వభి ధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా
మా మేవైష్య త్యసంశయః    18-68

సంప్రదాయ మెలా ఉండాలో వర్ణించారు. పోతే ఇప్పుడు సంప్రదాత అయిన ఆచార్య పురుషు డెలా ఉండాలో అలాంటి దేశికుడి కెలాంటి ఫల మబ్బుతుందో నిరూపిస్తున్నాడు భగవానుడు. శాస్త్రార్థం చక్కగా గ్రహించి ఒంటబట్టించుకొని దానిని స్వానుభవినికి తెచ్చుకొని ఉండాలి ఆచార్యు డనేవాడు. అలాంటివాడే మరొకడికి బోధ చేయడాని కర్హుడు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః- అనే గీతా శ్లోకార్థాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకొని చూడవచ్చు.

అలాంటి ఆచార్యుడు తాను గ్రహించిన పరమరహస్యాన్ని తనలోనే జీర్ణం చేసుకోక శిష్యులకు బోధించాలి. శిష్యులంటే పూర్వోక్త అధికార చతుష్టయ మున్న వాళ్ళు. అందులో కేవలం భగవద్భక్తి మాత్రమున్నాచాలు. వాడర్హుడే.

Page 128