మనమా అమృతరసాన్ని ఆస్వాదించ గలుగుతాము. అనంతానందానుభూతి నందుకోగలుగుతాము.
111
ఇదంతే నాతప స్కాయ- నాభక్తాయ కదాచన
న చాశు శ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి 18-67
శాస్త్రోపదేశ మిక్కడికి సమాప్తమయింది. తదుపదిష్టమైన సాధన మార్గం కూడా బోధపడింది. పోతే ఇలాంటి బోధ మనం చేసుకొన్నతరువాత దానిని మరలా ఎవరికి బోధించాలని ప్రశ్న వస్తుంది. ఏమి బోధించకపోతేనని సవాలు చేయరాదు. విద్యా సంప్రదాయం దెబ్బతింటుంది. విద్య అనేది ఒకరివల్ల ఒకరికి సొక్రమించవలసిన ధనం. ఒక్కడే అనుభవించేది కాదు. అలాగే అనుకొంటే మొట్టమొదట సృష్టిలో ఎవడు గ్రహించాడో వాడు మాత్రమే తరించి మిగతా జీవులంతా నిర్జీవులయి పోయేవారు. ప్రతియుగంలోనూ కొంతకు కొంత అయినా మానవాళి తరిస్తున్నదంటే అది గురుశిష్య సంప్రదాయమనేది ఒకటి ఉండటం మూలాన్నే.
అయితే బ్రహ్మవిదుడైనవాడు సంప్రదాయాన్ని కాపాడవలసిందే. అలా కాపాడడాని కతడు తనవిద్య లోకులకు బోధించవలసిందే. కాని ఇందులో ఒక తిరకాసు ఉంది. బోధించాలి గదా అని ఎవరికంటే వారికి ఈ విద్య బోధించ గూడదు. అన్ని విద్యలకన్నా విలువైన విద్య ఇది. రాజవిద్య అన్నారు దీన్ని. అలాంటి విద్య అనర్హులకు బోధిస్తే సుఖంలేదు. వారు దానిని విశ్వసించక పోవచ్చు. అవహేళన అయినా చేయవచ్చు. దాని వల్ల నీకు నిర్వేదం కలగవచ్చు. ఆ నిర్వేదం నీకు నిరుత్సాహం కలిగించవచ్చు. ఎన్నో ఉన్నాయి ఈతి బాధలు.
అందువల్ల సర్వవిధాలా అధికారి అయినవానికే బ్రహ్మవిద్య నుపదేశించాలి విద్యోపదేష్ట, ఎవరా అధికారులని అడిగితే చెబుతున్నాడు భగవానుడు. అధికార మున్నవాడే అధికారి. అధికారమనేది నాలుగువిధాలు. ఒకటి తపస్సు, తప స్సంటే అతిసూక్ష్మమైన భావాన్ని కూడ ఆలోచించి పట్టుకొనే శక్తి. రెండవది భక్తి. భక్తి అంటే విషయం మీదా దాన్ని బోధించే ఆచార్చుని మీదా - ఎనలేని గౌరవం మూడవది శుశ్రూషశాస్త్రమూ, ఆచార్యుడూ తనకు బోధించే విషయం వినాలనే ఉత్కంఠ. పోతే నాల్గవది అనసూయ. ఏ పరతత్త్వాన్ని గూర్చి చర్చ జరుగుతున్నదో దానిమీద గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఇలాంటి నమ్మక
Page 127