వీటి నన్నిటినీ వదలించు కోవాలంటే ఏమిటి మనకిప్పుడు ఉపాయం. అది ఎప్పటికైనా ఆ పరమాత్మనే ఆశ్రయించటమే. అదే సబబు కూడ. ఎక్కడి నుంచి పడ్డామో-పడి దేనికి దూరమయ్యామో- మరలా దానినేకదా మనం పట్టుకో వలసింది. ఈ పట్టుకొనే భావం పరమాత్మ అయితే-పట్టుకొనే సాధనం విద్య. విద్యేకదా అవిద్యకు విరుగుడు. అవిద్యవల్ల క్రింద పడ్డాము. విద్య వల్ల పైకి లేస్తాము. విద్య అంటే బ్రహ్మమే నేనని మరలా గుర్తించటం. గుర్తిస్తే బ్రహ్మమే అవుతాడు జీవుడు. "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి" అని శాస్త్రమిచ్చే హామీ. అంచేత జ్ఞానమే అనుష్ఠాన మిక్కడ. అంతకన్నా అనుస్థాన Practice మనేది మరేదీ వేరుగా లేదు వేదాంత రంగంలో.
ఈ అనుష్ఠాన రూపమైన జ్ఞానం రెండు పాయలుగా ప్రవహిస్తుంది. ఒకటి నేనా పరతత్త్వాన్నే అంతకన్నా వేరుకాదనే భావన. ఇదే శరణాగతి. పోతే రెండవది ఆబ్రహ్మమనేది ఏదోగాదు అది నాస్వరూపమే నేనేసుమా - అనే భావన. ఇదే పాపమోక్షమనేమాట. మనమీ ప్రపంచోపాధి అయిన జీవులం కాము - నిరుపాధికమైన చైతన్యమేనని అఖండగా ఎప్పుడు భావిస్తామో - ఆ అఖండవృత్తే మనల నీ అవిద్యామయమైన సంసార మహేంద్రజాలం నుంచి విముక్తులను చేస్తుంది. సందేహంలేదు. యద్భావ స్తద్భవతి. ఏది మనసా పదేపదే భావిస్తే అదే అవుతాడు మానవుడు. భ్రమరకోట దృష్టాంతమూ స్వప్న దృష్టాంతమూ- ఇలాంటి దృష్టింతాలెన్నో ఉన్నాయి దీన్ని సత్యమని చాటటానికి.
ఏతావతా తేలిన సారాంశ మేమిటి. గీతా శాస్త్రాని కంతటికీ సారభూతమైన విషయమిదే. నేనొక జీవుడనే అని భావిస్తే ఈ పిండాండమూ బ్రహ్మాం డమూ - వీటి మూలంగా సతమతమయ్యే నేనూ- వీటన్నిటికీ అతీతుడైన ఒక ఈశ్వరుడూ - ఇంత ఉన్నది వ్యవహారం. ఇదే సంసారబంధం. విషాదయోగం. కాగా నేనీ జీవుడేమిటి - సర్వదా సర్వధా సర్వత్రా ఉన్న చైతన్యమే నేనని ఎప్పుడు భావిస్తామో అప్పుడు ఈ జీవుడులేడు. అండపిండాత్మకమైన ప్రపం చమూ లేదు. వీటి కతీతుడైన ఈశ్వరుడూ లేడు. అంతా కలిసి అద్శితీయమైన నాచిత్స్వరూపమే. నేనే. ఇదే సంసారమోక్షం. మోక్ష సన్న్యాసయోగం. ఇందులో మొదటిది అవిద్యవల్లనైతే - రెందవది విద్యవల్ల. కనుక అలాంటి ఆధ్యాత్మ విద్య అనే అమృత పాండానికి నిలయమే ఈ గీతాశాస్త్రమనే క్షీరసాగరం. అసుర శక్తితోగాక దైవసంపదతో దాన్ని మనోమందిరంలో పెట్టిమధించినప్పుడే
Page 126