#


Back

అదే “మామేకం శరణంప్రజ" మాం అంటే నన్ను అని అర్థం. నన్ను అంటే ఎవడా నేననే వ్యక్తి. ఎదుట నొగలమీద కూర్చొని గుఱ్ఱాలుతోలే నీలమేఘ శ్యామలమైన విగ్రహమని తోస్తుంది. అది కాదు. అదే అయితే ఆ విగ్రహం అర్జునుడింకా బ్రతికి ఉండగానే కాల ప్రవాహంలో కలిసి పోయింది అది అర్జు నుడికి ఎలా శరణ్య మవుతుంది. కాబట్టి నేసంటే ఒకానొక క్షేత్రంలో కుంచిం చుకు పోయిన నేనుకాదు. సర్వక్షేత్రాలలో వీరవిహారం చేసేనేను. అంటే “యేన సర్వ మిదంతత" మ్మనే వాసుదేవ స్వరూపం. "వాసుదేవ స్సర్వమితి" అనే వాక్యానికిది మరలా ప్రతిధ్వని, అక్కడా "మాం ప్రపద్యతే" అనే ఉందిమాట. మాం అనేది ఏమిటో వివరించా డక్కడ "వాసుదేవ స్సర్వమితి” అని. వాసు దేవుడంటే వసుదేవస్య అపత్యం పుమాన్ కృష్ణః అని పోతుంది మన శాబ్దిక మైన దృష్టి. అది కాదు "వాసుదేవ" అంటే. వసతి-సర్వత్ర అస్తి -దీవ్యతి- ప్రకాశతే- చైతన్య రూపేణ సదా సర్వత్ర ఇతి వాసుదేవః ఏదైతే సర్వత్రా ఉన్నదో భాసిస్తున్నదో అది. మరో మాటలో చెబితే సత్తు- చిత్తు- ఇంతకన్నా ఏమీలేదు. ఇలాంటి తత్త్వమే నేనని గట్టిగా పట్టుకోవాలి. ఇదే శరణాగతి.

అలా పట్టుకొంటే చాలు. అది స్వతః ప్రకాశమైన ఆత్మతత్త్వమే కాబట్టి సుషుప్త్యాదుల లాగా అభావరూపం గాక భావ రూపంగానే నిలిచి ఉంటుంది. అంతే గాదు. అలా నిలిచిన ఆ అఖండభావనే మన సకల పాపాలనూ ప్రక్షా ళితం చేసి మనలను వాటి బారినుంచి బయటపడ వేస్తుంది. అదే విమోచన మీజీవుడికి. అప్పటి నుంచీ అటు జగద్భావమూ లేదు. ఇటు జీవభావమూ లేదు. ఆవరణ విక్షేపాలు రెండూ పటాపంచలవుతాయి. దానితో త్రిగుణాత్మక మైన మాయ మన మీద పని చేయదు. మాయే లేదంటే తన్నిమిత్తంగా కలిగే విషాద మెప్పుడో బలాదూరయింది.

ఇందులో శరణాగతి మన వంతయితే పాపవిమోచన మీశ్వరుని వంతు. శరణాగతి అంటే అర్థం చెప్పాము. పాపమంటే ఇప్పుడు చెప్పవలసి ఉంది. పాపమన్నా పాతకమన్నా క్రింద పడగొట్టేదని అర్థం. శుద్ధ చైతన్య రూపుడైన జీవుణ్ణి మొదట పడగొట్టింది అవిద్య. ఆవిద్య పడగొడితే అక్కడినుంచి కామంలో పడ్డాము. కామం పడగొడితే కర్మలో పడ్డాము. కర్మ నుంచి మరలా జన్మలో పడ్డాము. ఇది ఒక పెద్ద పద్మవ్యూహం. విషవలయం. పడటమే తప్ప లేవటం లేదు దీనిలో. ఇలా పడగొట్టి పరమార్థానికీ మనలను దూరంచేశాయి కాబట్టే ఇవన్నీ పాపాలే మనపాలిటికి. అవిద్యా కామ కర్మ జన్మలన్నీ పాపాలే

Page 125