#


Back

అంతేకాదు. దీని విలువ తెలుసుకో లేకపోతే అది మనల నీ సంసార సాగరం లోనే ముంచుతుంది. కాబట్టి అదే మన పాలిటికి శత్రువు కూడా అవుతుంది.

కాబట్టి దాని విలువ తెలిసి ఆ ఆత్మాకార వృత్తిని నిరంతరమూ ఆ వృత్తి చేసుకోవాలి మనసులో. దానితో మన ఆత్మ స్వరూపాన్ని మనం పైకి తెచ్చుకో గలం - ఎక్కడబడితే అక్కడ దర్శించగలం. లేక పోతే ఆధఃపాతాళాని కణగ ద్రొక్కినట్టయి ఎక్కడాకనిపించదది.

110
సర్వధర్మాన్ పరిత్యజ్య-మామేకం శరణం ప్రజ
అహం త్వాసర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః    18-66

కాబట్టి ఇంతకూ చెప్పవచ్చే దేమంటే మోక్ష సాధకుడైన మానవుడు ఇక మీన మేషాలు నెమరువేస్తూ కూచోరాదు. మనసు నిలుస్తుందా నిలవదా- మన మింత గొప్ప స్థాయిని ఈ జీవితంలో అందుకోగలమా అందులోనే కూచుంటే మన గతి ఏమి - మన పనులెలా జరుగుతాయి - అని ఇలాంటి ఆలోచనలే పనికిరావు. అవన్నీ ప్రకృతి ధర్మాలు మనవి కావు. ప్రకృతి ధర్మాలు మన అవిద్యాదోషంవల్ల మనసులో చేరి మనలను నిత్యమూ భ్రమ పెడుతుంటాయి. ఇవే కర్మవాసన లంటే. సాధన సాగకుండా అడ్డు తగిలేవి ఇవే. కాబట్టి వీటన్ని టినీ సమూలంగా వివేచనా బలంతో పరిత్యజించాలి మోక్షకాముడు. ఒక్కటి కూడా లోపల మిగల నీయరాదు. ఋణశేషం- శత్రుశేషమున్నట్లు ఏకొంచెం శేషించినా అది మన బుద్దిని దూషిస్తుంది. కాబట్టి శత్రువుమాదిరి ద్వేషించ వలసిందే. దానితో విక్షేపమనే దోషం Distraction పూర్తిగా తొలగి పోతుంది సాధకుడికి.

అయితే ఇది ప్రతిలోమసాధన. అనులోమం కాదు. విక్షేపం పోయినా ఆవరణమనే దోషమొకటి Contraction ఉంది మనకు. అది చాలా ప్రబలమైన దోషం. ప్రతిలోమంగా సాధిస్తే పోయేది కాదది. అనులోమంగా అభ్యసించాలి. అంటే అన్ని విక్షేపాలూ తొలగిన తరువాత ఉన్నదిక ఏమిటా అని ఆలోచించాలి. లేకుంటే అది శూన్యమయి కూచుంటుంది. ఇలాంటి శూన్యం సుషుప్తి మూర్ఛాది దశలలోనే ఉంది మనకు. ఇక క్రొత్తగా సాధనదేనికి. కాబట్టి విక్షేపం లేదు. శూన్యంకాదు అలాంటి దేదో భావరూపంగా ఒకటి అనుభవానికి రావాలి మానవునికి. ఏమిటది.

Page 124