#


Back

ప్రసిద్ధంగా యజ్ఞమని వ్యవహరిస్తుంటాము. పోతే రెండవది జప యజ్ఞం. ఇదీ ఒక అనుష్ఠానమే. అయినా దాని లాగా కాయికం కాదు. వాచికం. ఉచ్చారణ రూపమైనది. పంచాక్షరి -అష్టాక్షరి- ఇలాంటి మంత్ర పఠనం. దీని తరువాత మూడవది ఉపాంశు యజ్ఞం. అందరికీ కాక దగ్గరగా కూర్చున్న ఏ ఒకరిద్దరికో వినబగే లాగా జనాంతికంగా చేసే పఠనం. జపంకన్నా సూక్ష్మమైన దిది. పోతే నాల్గవది మానసం ఇది శారీరకం కాదు. వాచికం గాదు. కేవలం మనసులో మాత్రం జరిగే క్రియ. మనోవృత్తి రూపమిది. ఈ వృత్తు లెన్నైనా ఉదయిస్తుం టాయి నశిస్తుంటాయి మనసులో. తానే అలా ఉదయించక నశించక ఏక రూపంగా వర్తించే వృత్తి ఒక్కటే ఉంది. అదే బ్రహ్మాకార వృత్తి. విషయ విషయి విభాగం లేని వృత్తి కాబట్టి అది ఏక రూపం. అనుదితా నస్తమిత మన్నారు. పెద్దలు.

ఇలాంటి వృత్తి నిరంతరంగా మనసులో అవృత్తి కావటానికే జ్ఞాన యజ్ఞ మని పేరు పెట్టారు. జ్ఞాన రూపమైన అనుష్టానంతో పరమాత్మ నారాధించటం కాబట్టి జ్ఞాన యజ్ఞమనే పేరు సార్థక మయింది. అంతేకాదు. మిగతా విధిజపాది యజ్ఞాలు మన కాపేక్షికమైన ఫలాన్నిస్తే ఇది నిరపేక్షమైన మోక్ష ఫలాన్నే ప్రసా దిస్తుంది. కాబట్టి వాటికి విలక్షణంగా దీనిని జ్ఞాన యజ్ఞమని పరిగణించవలసి వచ్చింది. ఇంకా ఒకటున్నది రహస్యం. తతిమా యజ్ఞాలలో ఏ ఫలితం చెప్పారో అదంతా ఇందులోనే కలిసి వస్తుంది మనకు. అందుచేత కూడా ఇది సర్వో త్కృష్టమైన మార్గం. దీనిని బట్టి సాధకుడు గమనించ వలసిందేమిటంటే జీవితంలో ఇక మిగతా యజ్ఞయాగాది కర్మలకూ తత్తద్దేవతో పాసనాదులకూ స్వస్తి చెప్పి సర్వకాల సర్వావస్తలలోనూ శాస్త్రా చార్యోవ దిష్టమైన ఈ జ్ఞాన రూపమయిన యజ్ఞాన్ని అభ్యసిస్తూ పోవటమే. ఈ ఒక్క యజ్ఞానుష్టానం వల్లనే నేను సుప్రీతుణ్ణి సుప్రసన్నుణ్ణి అవుతానని హామీ ఇస్తున్నారు మనకు పరమాత్మ.

114
కచ్చి దేత చ్చుతమ్ పార్థ-త్వయైకాగ్రేణ చేతసా
కచ్చి దజ్ఞాన సమ్మోహః - ప్రణష్టస్తే ధనంజయ    18-72

శిష్యాచార్య సంవాదమైన తరువాత ఆచార్యుడు తాను బోధించిన శాస్త్రా ర్ధాన్ని శిష్యుడు గ్రహించాడో లేదో గ్రహించిన విషయం బాగా మనసుకు

Page 130