#


Back

ఇది లోక విషయంగా చెప్పినమాట. పోతే మన సాధన విషయంలో కూడా ఇంతే. అయితే ఒక విశేష మేమంటే లౌకికంలో కేవల ప్రారబ్దం వల్లనే పనులు జరుగుతాయి. దానినే ఈశ్వర ప్రేరణగా చెప్పుకొన్నాము. పోతే ఇక్కడ సాధన విషయంలో అలాకాదు. ఈశ్వరుడే స్వయంగా అనుగ్రహిస్తాడిక్కడ. సాధన అంతకంతకూ ప్రబలమై ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి ఫలించేలాగా చూస్తాడు. మనస్సు కున్న దౌర్బల్యం మాటేమిటిని అడగవచ్చు. దౌర్బల్యం దానికి సహజంకాదు రజస్తమోగుణ సంపర్కంవల్ల ఏర్పడింది. అది నిరంతర బ్రహ్మ చింతనలో ఉన్న సాధకుడికి ఈశ్వరానుగ్రహం వల్ల తొలగిపోతుంది. మరలా ఈ ఈశ్వరుడు ఎక్కడినుంచి వచ్చాడని ప్రశ్నించ రాదు. తాను ఈశ్వరుడయ్యే వరకూ ఈశ్వరుడొక డుండనే ఉంటాడు. లేదా తానే ఈశ్వరుడనే ఏ భావన ఉందో అదే ఈశ్వరుడనుకొవచ్చు. ఆ భావనే మనలను అనుగ్రహిస్తుందని చెప్పినా చెప్పవచ్చుగదా.

మొత్తంమీద అనన్యభక్తి యోగానుష్ఠానం సాధ్యమే. అసాధ్య మనుకొనే రెండు ప్రతిబంధకాలూ చిత్తశుద్ధితో ముందుకుపోయే సాధకుణ్ణి ఎన్నడూ బాధిం చవు. ఎంచేతనంటే వాడు లౌకిక వ్యవహారాలన్నీ ప్రారబ్ధానికి ఒప్ప చెబుతాడు. పార లౌకికంగా జరిగే సాధన అంతా తన ఈశ్వర భావనకే అప్పగిస్తాడు. అందులో కూడా అప్పుడప్పు డంతరాయాలు కలుగుతుంటే అవి తన ప్రబల మైన ప్రారబ్ధదోషం వల్లనైనా కావచ్చు. లేక తన ఆత్మభావన అంత ప్రబలంగా లేనందువల్లనైనా కావచ్చునని సమాధాన పడతాడు. అలా పడగలిగితే చాలు. ఆప్రారబ్దం కూడా అతి చిత్రంగా తొలగిపోయి ఈశ్వరానుగ్రహానికే పాత్రు డౌతాడు సాధకుడు. ఇదీ దీనిలో ఇమిడి భాన్న సాధన రహస్యం.

107
సదృశమ్ చేష్టతే స్వస్యాః - ప్రకృతేః జ్ఞానవా నపి
ప్రకృతిమ్ యాంతి భూతాని- నిగ్రహః కిమ్ కరిష్యతి    3-33

సాధన అనేది మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడూ చేసి తీరాలని అలా చేసి నప్పుడే మోక్షానికి నోచుకొంటాడని తీర్మానించారు. బాగానే ఉంది. కాని అసలు ఆ సాధన అనేదే చేయగలమా అని ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఏ సాధన మనం చేయాలన్నా అది మన సంకల్పాన్ని బట్టి

Page 120