#


Back

ఉంటుంది. సంకల్పమనేది మన స్వభావాన్ని బట్టి ఏర్పడుతుంది. ఈ స్వభా వానికే ప్రకృతి అని పేరు. ప్రకృతి అంటే ఇది ఈశ్వర ప్రకృతిగాదు. మానవ ప్రకృతి. బహు జన్మల నుంచీ పోగయిన సంచిత కర్మ ఫలంగా వర్తమాన జన్మలో జారీ అయి కూచున్న మన ధర్మా ధర్మ సంస్కారానికే ప్రకృతి అనిపేరు. దీనినే ప్రారబ్ధమని కూడా పేర్కొంటారు. ఇది ముందుగానే జారీ అయి కూచుంది. కాబట్టి దీని నేమి చేయటానికి లేదు. జన్మతో ప్రారంభమై మరణంతో సమాప్తమవుతుందది. ఈ మధ్య కాలంలో మన మెంత పనిట్టుకొన్నా తొలగి పోయేది కాదు.

అలాంటప్పుడిక మన సాధన ఏమిటి. ప్రయత్నమేమిటి. మనం ప్రయత్న మనేది ఇప్పుడుగదా ప్రారంభిస్తున్నాము. ఇది ప్రారంభించక పూర్వమే అది రంగంలోకి వచ్చి వుంది గదా. దీనికన్నా దానికి బలమెక్కువ. అది దీనిని కొడి ఎత్తనీయదు. జీవితమంతా అదే రాజ్యం చేస్తున్నదాయె. ఏ క్షణంలో మనకే సంకల్పం కలగాలో - ఏ మాట మాటాడాలో- ఏ పని చేయాలో అంతా అదే నిర్ణయించి కూచుంది. ఇక క్రొత్తగా మనమొక ప్రయత్నం చేయటాని కవకాశ మెక్కడిది. ప్రారబ్దాధీనమే మన బ్రతుకంతా. మనసా వాచా-కాయేన దాని కనుగుణంగానే నడుచు కొంటాడు ప్రతి ఒక్క మానవుడూ. జ్ఞాని అయినా అలా నడుచుకోవలసిందే. ఇక పామరుడి మాట చెప్పేదేముంది.

మరి ప్రతి ఒక్కడూ ఇలా తన ప్రారబ్ధానికి దాసుడై ప్రవర్తిస్తున్నప్పుడు సాధన చేయమనే మాట కర్దమేముంది. ఎలా చేయగలడు వాడు సాధన. మానవ యత్నాని కాస్కారమే లేదుగదా. ఆస్కారమనేది ఉంటే శాస్త్రమైనా ఆచార్యుడైనా మనకొకటి బోధించవచ్చు. మనం దాన్ని పాటించవచ్చు. అసలే ఆస్కారం లేన ప్పుడా శాస్త్రమూ నిరర్థకమే. ఆచార్యుల బోధా నిరర్థకమే. మరి దీనికేమిటి పరిష్కారమని ప్రశ్న.

108
ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే - రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్నవశ మాగచ్చే- త్తా హ్యన్య వరిపంథినౌ 3-34    3-34

నిజంగా ఇది ఒక గడ్డు సమస్యే. పైకి చూస్తే ఏ మాత్రమూ దీనికి పరి ష్కారమే లేదని తోస్తుంది. పరస్పర విరుద్ధమైన భావాలు రెండున్నాయి ఇక్కడ. ఒకటి దైవము-fate-మరొకటి పురుషకారము -Free will. అత్తా కోడళ్ళ

Page 121