#


Back

అది ఈనగాచి నక్కలపాలు చేయటమే. కాబట్టి ఆక్షణంలో కూడా గట్టిగా నిల బడాలి సాధకుడు. నిలబడితే జీవితమూ మరణమూ అంటూ వేరుగా కన బడవు. పరస్పర విరుద్దంగా కనిపించే అవి రెండూ ఏకంగానే అనుభవానికి వస్తాయి సాధకుడికి. పరాయణ మనే మాట ఈ భావాన్నే సూచిస్తుంది. పోయినా అందులోకే పోవటమని దాని అర్ధం. ఇది ఆఖరి మెట్టు సాధనలో. సాధనే కాదు. ఇది సిద్ధి. అపునరావృత్తి అన్నా ఇదే అందులో చేరితే ఇక మరలా తిరిగి రావట మంటూ లేదు.

ఏమిటి దీని భావం. అనాత్మకూడ మనకెప్పుడాత్మగా అనుభవానికి వచ్చిందో ఆ అనుభవ మెప్పుడు మనకు స్వాభావిక మయిందో అదే మనం చేరవలసిన స్థానం. అలాంటి స్థితిలోనుంచి మనమిక మరలా రావటమనే దేముంది. రావాలంటే దాని కంటే విలక్షణమైన దేదైన ఉంటే గదా. దానికి విలక్షణ మీ నామరూపాలే. అవి ఆత్మలోనే ప్రవిలయ మయినాయి. ఇక ఎలా వస్తుందది. ఎక్కడికి వస్తుంది దాని పాటికది కదలకుండా ఉండవలసిందే. కను కనే దాన్ని కూటస్థమన్నారు శాస్త్రంలో. దాన్ని చేరటానికే ఇంత శిక్షణ. దీనివల్ల ఆనాత్మ రూపమైన కల్మషమంతా క్షాళితమై పోతే ఆప్రయత్నంగానే మనకది సిద్దిస్తుంది. మన స్వరూపమే గదా అది. సిద్దించక ఏమవుతుంది.

106
అనన్యా శ్చింతయంతోమా- యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం    9-22

అందుకే జీవితాంతమూ అనన్యమైన చింతనతో ఉండాలి మానవుడు. అన్యం లేనిదేదో అది అనన్యం. అది సర్వతో వ్యాప్తమైన ఆత్మతత్త్వ మొక్కటే. అది మన స్వరూపమే. ఇలాంటి స్వరూపమే ఎక్కడ బట్టినా. అదితప్ప మరేదీ లేదు. అంటే ఏమన్నమాట. నీవు నిత్యమూ కండ్లు పెట్టుకొని ఏది చూస్తున్నావో - చెవులతో ఏది వింటున్నావో-చేతులతో ఏది స్పృశిస్తున్నావో -ందంతా ఆత్మే.. ఏ ఇంద్రియానికే విషయం గోచర మవుతున్నా దానినంతా ఆత్మ చైతన్యంగానే భావిస్తు పోవాలి. అంతేగాని ఇది శబ్దమని- ఇది స్వర్శమని- ఇది రూపమని- స్వరూపానికి భిన్నగా చూడగూడదు.

ఇలాంటి ఆత్మైక భావనకే అనన్య భక్తి అని పేరు. అసన్యభక్తి అన్నా - పరా భక్తి అన్నా- ఒక్కటే. ఇది మామూలుగా మనమనుకొనే భక్తికాదు. మామూలు

Page 118