#


Back

తన విభూతిగానే భాసిస్తుంది కాబట్టి అది తన స్వరూపమేననే స్ఫురణ ఉంటుంది కాబట్టి- ఇక విస్మరణ మనే ప్రశ్నలేదు. నిరంతర స్మరణమే అవుతుందది.

105
తద్బుద్ధయ స్తదాత్మాన - స్తన్నిష్ఠా స్తత్పరాయణాః
గచ్చ స్త్యవునరావృత్తిం - జ్ఞాననిర్దూత కల్మషాః    5-17

అయితే ఇంత మహోన్నతమైన స్థితి నందుకోవాలంటే ఎంత సులభమని చెప్పినా అందులోనూ కొంత మెళకువ కావలసి ఉంది సాధకుడికి. ఏది ఫలితానికి రావాలన్నా ఊరకవచ్చి ఒడిలో పడదది. దానికొక పద్ధతి అంటూ ఉంటుంది. అందులో శిక్షణపొందిన వాడికే క్రమంగా అది పాకానికి వస్తుంది. భౌతికమైన శిక్షణ కాక పోయినా ఇది ఒక మానసికమైన శిక్షణ.

ఈ శిక్షా మార్గంలో నాలుగు భూమికలున్నాయి. మొదటితి "తద్బుద్ధయః” అంటే దాని మీదనే బుద్ధి ఉండాలి సాధకుడికి. అంటే ఎప్పుడూ అదే స్వరూపం కనపడుతూ ఉండాలి మనో నేత్రానికి. అది తప్ప మరొక విజాతీయ భావ మేదీ మనసుకు రాగూడదు. వస్తే దీనికి తిలాంజలి ఇవ్వవలసి వస్తుంది. కనుక అనుక్షణమూ అదే లోకంగా ఉండాలి మనం.

అలా ఉన్న తరువాత అదీ నేనూ అనే విభాగం కూడా వదిలేసి అది నేనే అనే నిశ్చయానికి రావాలి. "తదాత్మానః" ఆత్మ అంటే స్వరూపం. దానికి విజా తీయమైన ప్రపంచమంతా అనాత్మ ఆనాత్మను చూచేటప్పుడుకూడ అది ఆత్మే అనే అనుసంధానం కావాలి. అప్పుడిక ఆనాత్మ నంతటినీ తనలో లీనం చేసు కొని ఆత్మ చైతన్మమే పైకి తేలుతుంది. సర్వతోముఖంగా ప్రసరిస్తుంది.

అలా ప్రసరించిన ఆ చైతన్యంలో నుంచి జారకుండా నిత్యమూ అందులో నిలిచి ఉండాలి. దీనికే నిష్ఠ అని పేరు. తైలాధారలాగా ఎప్పుడూ ఒకే ఒక భావంతో నిలిచి ఉండటాన్నే నిష్ట అంటారు. ఇది ఒక్కసారిగా అబ్బదు. క్రిందా మీదా పడితే ఎప్పటికో పాటుకువస్తుంది. వచ్చినందుకు దాఖలా ఇక మరలా అనాత్మ పంకంలో పడకపోవటమే.

అయితే ఇది జీవితాంతమూ మనం ద్రవిడ ప్రాణాయామంలాగా పట్టు కొన్నా అవసానంలో పట్టు సడలవచ్చు. అలా సడలితే మరలా సుఖంలేదు

Page 117