#


Back

104
యదా భూత పృథాగ్భావ - మేకస్థ మను పశ్యతి
తత ఏవచ విస్తారమ్ - బ్రహ్మ సంపద్యతే తదా    13-30

ఈ ఆత్మైకత్వ స్థితినే మరొక భాషలో మనకు బోధిస్తున్నాడు పరమాత్మ. నేను-నాకు కనిపించే ఈ భూత ప్రపంచం. ఇవి రెండే మన అనుభవంలో ఉన్న భావాలసలు. ఇందులో ఈ భౌతిక జగత్తంతా ఒకటి గాదు. నానా విధ నామరూపక్రియా భేద భిన్నం. ఇలాటి భిన్నమైన జగత్తు నంతా ఏకంగా ఒకే ఒక తత్త్వంగా చూడటం నేర్చుకోవాలి సాధకుడు.

ఏమిటా ఏకం. ఆత్మ చైతన్యమే. అది ఎప్పుడూ ఏకమే గాని ప్రపంచం లాగా అనేకం గాదు. ఎందుకంటే చిద్రూంప తప్ప దానికి మరొక రూప మంటూ లేదు. చిద్రూప మని మాటే గాని అది ఒక రూపమే గాదు వాస్తవానికి. ఆకాశం లాగా నలుదెసలా వ్యాసించిన ఒకానొక స్ఫూర్తి అది. అలాంటి దానికి రూప మనే దేముంది. పైగా అది ఎక్కడ ఉందనే ప్రశ్నే లేదు. నేనే. నేను నేననేదే ఆ స్ఫురణ దానికే ఆత్మ అని పేరు. అది మన అందరిలో ఉంది. లోపల భావరూపం గానూ వెలపల భూత రూపంగానూ పరచుకొని ఉన్న ఈ అనాత్మ జగత్తునంతా నిత్యమూ గ్రహిస్తూ ఉన్న చైతన్య తత్త్వమే అది.

అయితే వచ్చిన తిరకాసేమంటే అది ఈ జగత్తునంతా తనకు వేరుగా బాహ్యంగా దర్శిస్తున్నది. కనుక దృక్కనిదృశ్యమని రెండుగా విభక్త మయింది. అలాకాక దీనిని మరలా శాస్త్రా చార్యోపదేశ జనితమైన సంస్కార బలంతో దృగ్రూపమైన నేనే గదా అని తన ఆత్మకు అభిన్నంగా దర్శించగలగాలి. అప్పు డత్మై వేదమ్ సర్వమని ఇదంతా ఏకైకమైన ఆత్మ చైతన్యంగానే దర్శనమిస్తుంది. ఇది స్వరూపావస్థ.

పోతే ఆత్మత ఏవ ప్రాణః- ఆత్మత ఏవాస్న- మన్నట్టు ఈసర్వ ప్రపంచమూ మరలా ఏదో గాదు. తన ఆత్మ స్వరూపం నుంచే ఉదయిస్తూ- దానియందే సంచరిస్తూ తుదకు దానిలోనే లయిస్తున్నదని - అనాత్మ జగద్వ్యవహారాన్నంత టినీ నిజశక్తివిలాసంగానే నిత్యమూనిరీక్షించ గలిగి ఉండాలి. అప్పుడు తన స్వరూపమే గాక తనమహిమ ఏదోతనకు గోచరం కాగలదు. ఇది విభూత్యవస్థ.

ఇలా తన స్వరూప విభూతులు రెండూ తాను దర్శించగలిగితే తానే ఆత్మ తానే బ్రహ్మమూ కూడా అవుతాడు సాధకుడు. నామరూప ప్రపంచమంతా

Page 116