#


Back

ఇలా చూడటమే అసలు తత్త్వాన్ని చూడటమంటే. ఈ చూపులో తత్త్వ మంతా కలిసి వస్తుంది. చూపే తత్త్వమవుతుంది. అయితే ఇక వేరుగా చూడ వలసిందంటూ ఉండబోదు. చూడబడేది చూసేదే అవుతుంది. అప్పుడు చూడడ మనే మాటకు కూడా ఇక అర్ధంలేదు. మరి ఎక్కడా జాగాలేక తనలోనే ప్రవే శిస్తుందది. చమత్కారంగా చెప్పేమాటేగాని అది వాస్తవానికి ప్రవేశమేగాదు. అంతరమనేది ఉంటే గదా ప్రవేశించటానికి. అనంతర మన్నప్పుడు ప్రవేశ మేమిటి. కాబట్టి తాను తానుగా ఉండిపోవడమే ప్రవేశమనేమాటచేత ఔపచారి కంగా metaphorical నిర్దేశిస్తున్నాడు భగవానుడు.

103
మన్మనాభవ మద్భక్తో - మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణః    18-65

అయితే ఇలాంటి ఏకాత్మను సంధాన మేర్పడాలంటే సామాన్యంకాదు. దానికి పునాదులనుంచీ గట్టిచేసుకొంటూ రావాలి. అది ఎలాగంటే చెబు తున్నాడు. నాపైనే మనసుపెట్టి నన్నే భజిస్తూ నా కోసమే పనులుచేస్తూ నాకే విధేయుడవై ఉండు మనసూ బుద్ధీ నాకే ఎప్పుడు సమర్పించావో అప్పుడు నీవు నన్నే చేరుతావు. సందేహం లేదంటున్నాడు గీతాచార్యుడు.

ఈ నా అనేమాట కర్ధమేమిటి. ఈ కనిపించే నీల మేఘశ్యాముడని కాదు. పైన చెప్పిన సర్వ వ్యాపకమైన పరతత్త్వమే. అది సాధకుడి స్వరూపమే కాబట్టి నానా అవి ఉత్తమ పురుషలో చెప్పవలసి వచ్చింది. నా అంటే అప్పటికి ఆత్మచైతన్యమని భావం. దాని మీదనే మనసుండాలి మనకు. అంటే జీవితంలో మరే ఒకటీ ఆలోచించకుండా దానినే ఆలోచిస్తూ కూచోవాలి. మరి నిత్యమూ ఏపని చేస్తున్నా అదే చేస్తున్నదని భావించాలి. దానికే అధీనమై ఉండాలి ఎప్పుడూ.

ఇలా మనసూ బుద్ధీ దానికే ఒప్పచెబితే అదే అవుతాడు చివరకు. మనసంటే సంకల్ప వికల్పాలు కరణం. బుద్ధి అంటే నిశ్చయాత్మకం - కర్త. అర్పణమంటే క్రియ. కర్తృకరణ క్రియలు మూడూ అప్పగించటమంటే అప్పటి కేమన్నమాట. మిలిలేది చివరకిక సాక్షి రూపమైన ఆత్మ చైతన్య మొక్కటే. అది ఎవడికి వాడికి 33 నా స్వరూపమే. కాబట్టి నన్నే నేను చేరుతాను. అంటే నాకు నేనే మిగులుతానని తాత్పర్యం.

Page 115