అది ఎలా ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం పూర్తిగా ఉన్నప్పుడే ఏర్పడు తుంది. ఇంద్రియాలంటే కర్మేంద్రియాలూ ఉన్నాయి. జ్ఞానేంద్రియాలూ ఉన్నాయి. వెలపలి విషయాలు లోపల కందించేవి జ్ఞానేంద్రియాలైతే లోపల వాటిని వెలపలికి జారీ చేసేవి కర్మేంద్రియాలు. వీటికి నాయకులు అటు మనస్సూ-ఇటు ప్రాణమూ. ఈ కలాపమంతా ఇంద్రియాలనే జాతి క్రిందకే వస్తుంది. వీటి నదుపులో పెట్టుకోవాలి సాధకుడు.
ఇంత తరిఫీదు అయితే మనం జ్ఞానమనే ధనాన్ని ఆర్జించటానికి నోచు కొంటాము. జ్ఞానమంటే పరోక్షాపరోక్షాలు రెండూనని అర్ధంచేసుకోవాలి. ఇలాంటి జ్ఞానం సాధకుడి కబ్బిందంటే దానికొక్కటే తార్కాణం. శాశ్వతికమైన శాంతి లభించాలి సాధకుడికి. అదికూడా ఎప్పుడో కాలాంతరంలో కాదు. జ్ఞాన మెప్పు డబ్బిందో అప్పుడే.
90
అరురుక్షో ర్మునే ర్యోగం-కర్మకారణ ముచ్యతే
ఆరూఢస్య తు తస్యైవ - శమః కారణ ముచ్యతే 6-3
ఇంత వరకూ జరిగిన మీమాంస కంతటికీ ఏమిటి పండి తార్థం కర్మ- జ్ఞానం ఈ రెండింటికీ పైకి చూస్తే ఏదో వైరుధ్య మున్నట్లు కనిపిస్తుందేగాని ఆంతర్యంలో అలాంటి దేమీలేదు. మోక్ష మనేది గమ్యమనుకొంటే జ్ఞానం దానికి సాక్షాత్సాధనం. పోతేకర్మ సాక్షాత్తుగాకాదు గాని జ్ఞానంద్వారా సాధనం. అంటే కర్మ జ్ఞానానికి దారితీస్తే ఆ జ్ఞానం మోక్ష ఫలాన్ని ప్రాసాదిస్తుంది మనకు.
అంచేత గీత మనకిచ్చే సలహా ఏమంటే జ్ఞానం కలిగేదాకా కర్మ వదిలేయ రాదు. వదిలేస్తే జ్ఞానోదయానికి మార్గంలేదు. జపతపాలలాంటి యజ్ఞయాగాల లాంటి విధులు కాకపోయినా జ్ఞానార్జనకు తోడ్పడే కర్మ సమాధి భక్తియోగాలైనా ఆచరించవలసిందే గదా. ఆ మూటినీ కలిపి చెప్పే ఒక్కమాటే కర్మ అంటే. ఇలాంటి కర్మ లేదా యోగమనేది జ్ఞానం కలిగే దాకా సాగించవలసిందే తప్పదు,
పోతే జ్ఞానమనే ఫలం మనచేతి కెప్పుడందిందో ఇక కర్మకు ప్రమేయంలేదు. కాబట్టి జ్ఞానప్రాప్తి అనంతర మిక సాధకుడు దాన్ని పరిత్యజించ వలసి ఉంటుంది. జ్ఞాన మబ్బేవరకూ వాడారురుక్షుడు. అంటే పర్వత శిఖర మెక్కినట్టు ఎక్కుతూ ఉంటాడు. అబ్బిన తరువాత ఇక ఆరు రుక్షువు కాదు ఆరూఢుడు.
Page 101