అలా బ్రతిమాలినా అప్పుడే నీకు వారు బోధించ నక్కరలేదు. నీకు జిజ్ఞాస ఏమాత్రమున్నదో వారికెలా తెలుస్తుంది. "నాపృష్టః కస్యచి ద్బూయాత్" అన్నారు. కాబట్టి సాధన మార్గాన్ని గూర్చి నీవు వారి సనేక విధాల ప్రశ్నించవలసి ఉంది. ప్రశ్నవేస్తే రెండు రహస్యాలు బయటపడతాయి. అంతకు ముందు నీకెంత జ్ఞాన ముందనేది ఒకటి. ఇక ఎంత గడించాలనేది మరొకటి. రెండూ తెలుసుకో వలసినవే.
పోతే ఊరక ప్రొద్దుపోక కుతుహల కొద్దీ కూడా ప్రశ్నించవచ్చు. ఒకవేళ సమాధాన మిచ్చినా దాని నమలు పరచే శ్రద్ద లేకపోవచ్చు. కాబట్టి శ్రద్ద ఉందనే హామీ కూడా నీవు వారి కివ్వవలసి ఉంటుంది. అదే "సేవయా" అనేమాట కర్థం. అంతే గాని పాద సంవాహనాదులు కావుసేవ అంటే. అది అషాడభూతి లాంటి వాడు కూడా చేయవచ్చు. నీవూ నేనే కావలసిన పనిలేదు.
ఇదుగోఇన్ని విధాల పాటు బడితే ఎంతో యోగ్యతా కలవాడవని నమ్మకం తోస్తే వారు నీకు ఆజ్ఞాన మనేది ఉపదేశించగలరు. ఉపదేశించాలంటే వారు మొదట జ్ఞానలై ఉండాలి. అది కూడా కేవలమూ శాస్త్రజ్ఞానమైతే ప్రయోజనం లేదు. శాస్త్ర జ్ఞాన మనేది పరోక్షమే. అపరోక్షం కాదు. అనుభవానికి వచ్చినప్పుడే అది అపరోక్ష మవుతుంది. అదే తత్త్వ దర్శనం. తత్త్వాన్ని గ్రహించటమే గాక ముఖాముఖి దర్శించాలి కూడా. దర్శిస్తేనే పరిపూర్ణ జ్ఞానమిది. ఇలాంటి పూర్ణజ్ఞాన మార్జించిన మహా పురుషుడైతేనే వాడు తరించి మనలను కూడా తరింప జేయగలడు.
89
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం-తత్పర స్సంయతేంద్రియః
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి-మచిరేణాధి గచ్ఛతి 4-39
దేనికైనా చివరకు శ్రద్ధ అనేది ప్రధానం. జ్ఞానానికైనా అదే. విజ్ఞానానికైనా అదే. అది తల్లిలాగ సాధకున్ని కొనా మొదలూ కాపాడుతూ వస్తుంది. అంచేత అది ముందు లభిస్తే గాని ఇది క్రమంగా అనుభవానికి రాదు. ఆయితే ఈ శ్రద్ద అనే దేమిటి. ఏ రూపంలో ఉంటుందది. "తత్సర" అన్నారు. ఒక విషయంలో తత్పరత్వం లేదా తాత్పర్యం గలిగి ఉండటమే శ్రద్ద. తత్పరత్వ మంటే ఆదే లోకంగా మెలగటం. మరే అవరోధనా మనసుకు రాకపోవటమని ఆర్థం.
Page 100