#


Back

అంటే శిఖరం మీద పాదం నిలిపినవాడు. నిలపితే ఇక పైకిపోయే ప్రసక్తి ఏముంది. కనుక మరి చేయవలసిన కర్మ అంటూ ఏదీలేదు. ఏదీ లేదంటే శాస్త్రీయమైనవీ లౌకికమైనవీ కూడానని అర్థం. శారీరకమైనకర్మ మాత్ర మప్పుడూ ఉంటుంది. దానిని మాత్రం విడవటానికి వీలులేదు. అది ప్రారబ్దంతో జరిగేదికాబట్టి బ్రహ్మానుభవానికి ప్రతి బంధకం కాదు. అంతకుమించి చేసిం దంతా ప్రతిబంధకమే. అంచేత శమమే అప్పుడనుసరించ వలసిన మార్గం. శమమంటే కర్మలనుంచి విరమణ.

91
సన్న్యాసస్తు మహాబాహో - దుఃఖమాప్తు మయోగతః
యోగయుక్తో ముని ర్రహ్మ న చిరేణాధి గచ్చితి    5-6

దీనిని బట్టి ఎప్పటికైనా సాధకుడు కర్మలను సన్న్యిసించ వలసిందే! లేకుంటే జ్ఞానమబ్బినా అది నిష్ఠగా పరిణమించదు. నిష్ఠలేకుంటే ముక్తిలేదు. కాబట్టి జ్ఞానో దయమైన తరువాత అ సర్వకాల సర్వావస్థలలో నిలబడడానికి కర్మలను సన్న్యసించక తప్పదు. అయితే ఎటువచ్చీ అది ఉదయించటానికి పూర్వమే తొందరపడి వీటిని మనం వదులుకోరాదు. వదిలితే జ్ఞాన మార్జించటాని కసలు మార్గమే లేదని చెప్పాము. కాని కొందరి విషయంలో కర్మలేవీ చేయకుండానే బాల్యంలోనే సన్న్యసించినట్టు మనకు కనబడవచ్చు. వారు కారణ జన్ములు ఇంతకు ముందు జన్మలలోనే ఆ కర్మాను ష్ఠానం జరిగిపోయి ఉంటుంది వారికి.

మొత్తంమీద కర్మవల్లనే జ్ఞానం. అది ఉపాయం Means. ఇది దాని కుపేయం End. ఉపాయం లేకుండా ఉపేయం మనకెలా లభిస్తుంది. అందుకే యోగ యుక్తుడయితే సాధకుడు మనన శీలుడవుతాడు. ఆ మననంతో వెంటనే బ్రహ్మాన్ని అందుకొంటాడు. మనన మేమిటి. బ్రహ్మమేమిటి. ఆత్మజ్ఞానమే మననం. అది కర్మయోగం వల్లనే ప్రాప్తిస్తుంది మనకు. ఆజ్ఞానం మరలా కర్మసన్యాసం ద్వారా జ్ఞాననిష్టగా మారుతుంది. బ్రహ్మమంటే ఈజ్ఞాననిష్టే- మరేదీగాదు. ఇంతకూ వివక్షిత మేమంటే మోక్షానికి మార్గమొక్కటే-రెండులేవు. అది జ్ఞానమే. పోతే కర్మ లేదా యోగమనేది ఆ మార్గంలో మజిలీ మాత్రమే స్వతంత్రమైన వేరొకమార్గంకాదు.

Page 102