#


Index

యత్రాహ మపి తేనైవ నియుక్తః పుణ్యకర్మణా
తత్రైవాహం కరిష్యామి - పితు రార్యస్య శాసనమ్ - 22

  మరి నీ సంగతేమిటి. నాలాగే నీకు కూడా ఆయన తండ్రే గదా. తండ్రి మాట నాలాగా నీవూ పాటించాలిగదా అంటావా. నిజమే. తప్పకుండా పాటిస్తా. యత్రాహ మపితే నైవ నియుక్తః - నన్నెక్కడ ఉండమని ఆయన ఆదేశించాడో తత్రైవాహం కరిష్యామి పితుః శాసనమ్ - అక్కడే ఉండినే నాయన ఆజ్ఞ నెరవేరుస్తా. అంటే ఏమిటింతకూ సారాంశం. భరతుడికి రాజ్యపాలన అప్పజెప్పాడు కాబట్టి అతడదే చేయాలి. పోతే రాముడి కరణ్యవాసం విధించాడు కాబట్టి అతడరణ్యవాసమే చేయాలని భావం.

  ఇక్కడికి రామమూర్తి ఉపదేశించిన పూర్వగీత సమాప్తమయింది. రామగీతలో పూర్వగీత ఇది. పోతే ఇక ఉత్తర గీత ప్రారంభమవుతున్నది. మొదటిది రాముడు భరతుడికి చేసిన ఉపదేశమైతే హనుమద్రాము లిద్దరూ కలిసి కిష్కింధలో తార మొదలైన వానరాంగనలకు చేసినదీ రెండవది.

Page 56