ఉత్తర గీత
తతో నిపతితాం తారాం - చ్యుతాం తారామివాంబరాత్
శనై రాశ్వాస యామాస హనుమాన్ హరియూధ పః - 23
శ్రీరాముడు వాలినొక్క కోలతో కూల నేశాడు. నేలమీద కదలకుండా బల్లపాటుగా పడిపోయాడు వాలి. వానర సైనికులు పోయి వార్త చెబితే వాలి భార్య తార వెంటనే పరుగెత్తి వచ్చి వాలి శరీరం మీద వాలి ఆక్రందన చేయసాగింది. ఆకాశం నుంచి హఠాత్తుగా నేలరాలిన తారలాగా ఉందట తార. అది చూచి రామభక్తుడు హనుమంతుడామె నోదారుస్తూ మొదట కొన్ని మంచి మాటలిలా సెలవిస్తాడు.
గుణదోషకృతం జంతుః స్వకర్మ ఫలహేతుకంPage 57