అంటే ధర్మా ధర్మాలే. ధర్మం చేస్తే ధర్మ ఫలం అధర్మం చేస్తే అధర్మ ఫలం. జంతుః - జన్మించిన ప్రతి జీవి పరిస్థితీ ఇంతే, చేసినవాడికి చేసుకొన్నంత మహదేవా అని కర్మఫల మెలాంటిదైనా అనుభవించ వలసిందే. లేకుంటే అకృతా భ్యాగమ కృతవి ప్రణాశాలనే రెండు ప్రశ్నలకు జవాబు చెప్పవలసి ఉంటుంది. చేయనిది వచ్చి నెత్తిన పడితే అకృతాభ్యాగమం. చేసింది మాఫీ అయిపోతే కృత విప్రణాశం. రెండూ అర్థం లేనివే అయిపోతాయి. కనుక ఒక పని చేశామంటే ఫలితముండి తీరవలసిందే. క్రియకు ప్రతిక్రియ అనేది అనివార్యం.
అయితే అది ఎప్పుడు ఎక్కడ ఏ నిమిత్తంగా జరుగుతుం దనేది నీకూ నాకూ తెలిసేది కాదు, మన మల్పజ్ఞులం. ఫలితమనుభవానికి రావటమే మనకు తెలుస్తున్నది. అవ్యగ్ర స్తద వాప్నోతి. అంతవరకూ అనివార్యంగా మనం పొందవలసిందే. కాని అది మరణానికి ముందా ఆ తరువాతా అదేది మన చేతిలో లేదు. మరణానంతరం జరిగేది జననానికి ముందు జరిగింది అల్పజ్ఞులమైన మనకెలా తెలుస్తుంది. అది తెలిసినవాడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడొక్కడే. శుభా శుభం - ఆయనే ప్రాణులకు కలిగే మంచిచెడ్డలు నిర్ణయించగలడు. వాటికి దగిన సుఖదుఃఖాది ఫలమూ అందజేయగలడు.
Page 58