#


Index

శోద్యాశోచసి కంశోచ్యం దీనాం దీనానుకంపసే
కస్యకోవాను శోచ్యోస్తి -దేహేస్మిన్ బుద్బుదోపమే - 25

  కాకపోయినా శోచ్యా శోచసి కం శోచ్యమ్ ఎవరి కోసం నీవు శోకించటం. భర్త కోసమంటావా. మధ్యలో వచ్చిందేగదా భార్యాభర్తృ సంబంధం. అందులో ఎవరు పోయినా ఉన్నవారికి వారితో సంబంధ మక్కడికి తెగిపోయేదే గదా. అతణ్ణి గురించి నీవు శోకిస్తున్నావు సరే శోచ్యా శోచసి కంశోచ్యమ్ రేపు నిన్ను గూర్చి శోకించ వలసిందెవరు. మనం మాత్ర మెంతకాలమీ నేలమీద జీవిస్తాము. ఇవాళ వాలి అయితే రేపు మనం. అందరూ మరణించటం తధ్యమయి నప్పుడెనరిని గూర్చి ఎవరు శోకించా లంటావు. వాడు శోచ్యుడైతే వీడు మాత్రం శోచ్యుడు కాడా.

  అలాగే దీనం దీనాను కంపసే నీవు దీనురాలవై ఒకప్రక్క నీ భర్త దీనావస్థలో ఉన్నాడని అతడికి సానుభూతి చూపుతున్నావు. నీవిప్పుడు నీ పెనిమిటికి చూపితే రేపు నీకు చూపవలసిన వారెవరు సానుభూతి. పోయిన ప్రతి ఒక్కరూ శోచనీయులే. ప్రతి ఒక్కరూ దీనులే. దేహేస్మిన్ బుద్బుదోపమే అసలు మనకున్న ఈ శరీరమే బుద్బుదోపమానం. బుద్బుదంలాగే క్షణ భంగురమైనది. అలాంటప్పుడు - కశ్చకస్య అనుశోచ్యోస్తి - ఎవరెవరిని గూర్చి పలవించాలి. ఎవరెవరికి చూపాలి సానుభూతి.

  అసలిదంతా ఈ దేహమే నా స్వరూపమని భ్రాంతి పడటం వల్ల ఏర్పడిన ప్రమాదం. భౌతికమైన ఈ ఉపాధి ఎప్పుడూ నిలిచేదిగాదు. ఏదో ప్రారబ్ధమున్నంత వరకే దీని ఉనికి. అది తీరిందంటే ఇది పట్టుకొన్నా నిలవదు. పడిపోతుంది. పంచభూతాలలో కలిసిపోతుంది.

Page 59