Index
అలా పడిపోనిదీ కలిసిపోనిదీ ఒక్కటే. అది పరిశుద్ధమైన మన చైతన్యం. భౌతికం కాదది అభౌతికం. ఈ రహస్యం పెద్దల వల్ల గ్రహించి అదే మన స్వరూపమని దానితో తాదాత్మ్యం చెందామో అప్పుడు మనమెక్కడికీ పోము. పోకుంటే శోకం లేదు దైన్యం లేదు మనకు.
జానా స్యనియతా మేవం - భూతానా మాగతిం గతిం
తస్మాచ్ఛుభంహి కర్తవ్యం పండితే నైహ లౌకికమ్ - 26
అలాటి ఆత్మజ్ఞానం లేనంతవరకూ మనమందరమూ మర్తుల్యమే Mortals. జానాస్యనియతా మేవం భూతానా మాగతిం గతిం - సమస్త భూతాలూ రాకపోకలు చేస్తూ పోవలసిందే. ఇది నీకు తెలియని విషయం కాదు. చూస్తూనే ఉన్నావు నీ జీవితంలో. ఏమీ తెలియని పామరులే గాదు. అన్నీ తెలిసిన పండితులు కూడా. ఆఖరుకు వేదోక్తమైన సత్కర్మ లాచరించే కర్మిష్ఠులు కూడా. వారు స్వర్గాది లోకాలకు వెళ్లినా అక్కడ అన్ని సుఖాలూ అనుభవించినా తిరిగీ ఈ మర్త్యలోకంలో వచ్చి పడవలసిందే. గతా గతం కామ కామా లభంతే అని శాపం పెడుతున్నది శాస్త్రం. కామ్యములైన యజ్ఞయాగాదు లనుష్ఠించిన వారు కూడా అక్కడికీ ఇక్కడికీ నిర్విరామంగా ప్రయాణం చేయవలసిందే తప్పదు.
అంచేత నేనొక మాట చెబుతాను విను. శుభంహి కర్తవ్యం పండితేన ఐహలౌకికమ్. ఇహంలో తెలివిగల వాడెప్పుడే గానీ ఏది తన ఆత్మోద్ధరణకు తోడ్పడుతుందో అలాటి శ్రేయస్సునే అభ్యసించాలిగాని తాత్కాలికమైన ప్రేయస్సును గాదు.
Page 60