Index
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
అర్థం. అదే పరాగతి. అదే విదేహముక్తి. పర అన్నప్పుడది ఇక రావటమంటూ లేదు. అదే ఆఖరు జన్మ పరంపరకు. అయితే మరణానంతర మది మానవుడికి లభించాలంటే అంతకు ముందు జీవితంలోనే అది చవిచూచి ఉండాలి. అప్పుడే అది మరణానంతరం కూడా లభిస్తుందని నమ్మకం. లేకుంటే అందరిలాగా అది మరణమే నేమో చెప్పలేము. ప్రమాణం లేదు దానికి. కాబట్టి జీవితాంతమూ జ్ఞానికి జీవన్ముక్తి. జీవితానంతరం విదేహముక్తి అనేది తిరుగులేని సిద్ధాంతం.
ప్రకృత్యైవ చ కర్మాణి - క్రియమాణాని సర్వశః
యః పశ్యతి తధాత్మాన- మకర్తారం స పశ్యతి 29
అయితే ఒక ఆశంక. ఇంతగా వర్ణించి చెబుతున్నారు మీరు. కానీ ఇంత గొప్ప మహాభాగ్యం మానవ మాత్రులమైన మనకు పడుతుందా అని సందేహం. ఎందుకంటే మనమెంత పరతత్త్వాన్ని సర్వత్రా చూస్తున్నా అది మన స్వరూపమేనని భావిస్తున్నా ప్రకృతి అనేదొకటి రాజ్యం చేస్తున్నదిగదా. త్రిగుణాత్మకమైన ఆ ప్రకృతి మనమీద కూడా ప్రతిక్షణమూ దాడి చేయకుండా వదలి పెట్టదు. స్వభావస్తు ప్రవర్తతే అని - ప్రకృతే ర్గుణ సమ్మూఢాః అని కార్యతేహ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః అని మొదటి నుంచీ భగవద్గీత మనలను భయపెడుతూ వచ్చింది. ఇలా ప్రకృతికి ఎల్లప్పుడూ బానిసలమై బ్రతుకుతున్నప్పుడు దాన్ని త్రోసిపుచ్చి సర్వమూ
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు