పరమాత్మేనని చూడటమెలా సాధ్యమని సందేహించటం సహజమే. కాని
ప్రతి సమస్యకూ పరిహారమనేది ఉండనే ఉంటుంది. పరిష్కారం లేని
సమస్య సృష్టిలో ఉండదు. ఉంటే పరమాత్మ సర్వవ్యాపకుడనే సిద్ధాంతం
దెబ్బ తింటుంది. ఎందుకంటే సచ్చిద్రూపంగా ఆయన మనలో మనం
చూచే జగత్తులో వస్తు సిద్ధంగా ఉన్నప్పుడిక ప్రకృతికి గాని మరొక దానికి
గాని అవకాశమెక్కడిది. ఉంటే పరమాత్మ అయినా ఉండాలి. దాని నడ్డుకొనే
ప్రకృతి అయినా ఉండాలి. అడ్డుకొంటే పరమాత్మ అక్కడ లేడనేగా అర్థం.
లేకుంటే పరమాత్మ ఎలా అవుతాడు. కాబట్టి పరమాత్మే ఉన్నాడు సర్వత్ర.
జీవుని మనసులో మాటలో చేష్టలో ఉన్నదంతా పరమాత్మ తత్త్వమే. కనుక
పరమాత్మగా జీవుడే ఆలోచనా చేయటం లేదు. మాటాడటం లేదు. ఏ
పనీ చేయటం లేదు. అయినా ఆలోచనలూ మాటలు చేష్టలూ
జరిగిపోతున్నాయంటే అవి ఈ జీవుడు తానుగా చేస్తున్నవని భావించరాదు.
తనలో పరమాత్మ ఉన్నాడు ప్రకృతీ ఉన్నదా మాటకు వస్తే. అందులో
ప్రకృతి భాగం చేస్తుంటే తాను పరమాత్మ భాగంగా కేవలం సాక్షిత్వం
వహించి చూస్తున్నట్టు భావించాలి.
ఈ భావమే బోధిస్తున్నాడిప్పుడు గీతాచార్యుడు. ప్రకృత్యైవ చకర్మాణి క్రియ మాణాని సర్వశః - మనోవాక్కాయ కర్మలన్నీ నాలో ఉన్న ప్రకృతే చేస్తున్నదని యః పశ్యతి ఎవరు కేవలం సాక్షిగా చూస్తుంటాడో తథా