#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఆత్మాన మకర్తారం – తన్ను అకర్తగా అంటే తనకా కర్మల పట్ల ఏమాత్రమూ కర్తృత్వం లేదని అలాగా ఎవడు చూస్తాడో వాడే అసలు నిజంగా చూస్తున్నవాడు. మిగతా లోకులందరూ చూస్తున్నా చూడనివారే. చూడటమనేది అప్పటికి రెండు విధాలు. సాక్షిగా చూడటమొకటి. కర్తగా చూడటమొకటి. కర్తగా చూడటమంటే చేసే వ్యాపారాలు మన నెత్తిన పెట్టుకొన్న వాళ్ళమవుతాము. అది సంసార బంధానికి దారి తీస్తుంది. అలాకాక అన్ని పనులూ అది చేస్తుంటే కేవలం నేను దానికి సాక్షిగా ఉన్నానని చూచామంటే నాకేదీ అంటదు. కర్తృత్వమూ లేదు నాకు. భోక్తృత్వమూ లేదు. తప్పించుకోగలను. ఇదే సంసార మోక్షానికి మార్గం. ఇంతకూ ప్రకృతి గుణాలు మనలో లేవని గాదు. ఉన్నా వాటి నదుపులో పెట్టుకొనే భగవత్తత్త్వం కూడా ఉంది మనలో. అందులో ప్రకృతి గుణాలతో చేయి కలిపితే కర్తా భోక్తా అయి బంధాన్ని కోరి తెచ్చుకొనే ప్రమాదానికి గురి అవుతాము. దానితో పాటు పరమాత్మ తత్త్వం కూడా మనలోనే ఉంది కాబట్టి దాన్ని నిరంతరమూ అంటి పెట్టుకొంటే చాలు. ప్రమాదం నుంచి బయటపెడతాము. మొదటిది సమస్య అయితే రెండవది దానికి పరిష్కారం. అంచేత భయం లేదు. మేకస్థ మనుపశ్యతి

యదా భూత పృథద్భావ మేకస్థ మనుపస్యతి
తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా - 30

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు