#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఒకసారి చూచి మానేయటం కాదు. పశ్యన్నంటున్నాడు. సర్వకాల సర్వావస్థలలో అదే నీ దృష్టికి గోచరిస్తుండాలి. ఎవడా ఈశ్వరుడు. నీ స్వరూపమే. ఎక్కడ ఉందది. ఎలా ఉంది. సర్వత్ర సమవస్థితం. సకల భూతాలలోనూ సమానంగా పరుచుకొని ఉంది. సమం కనుకనే అది విషమం కాదు. విశేషం కాదు. సమం. సామాన్య రూపం. అప్పటికే మయింది. చూచే నీవూ ఆత్మ స్వరూపుడవే. నీకు కనిపించే సర్వమూ ఆత్మ స్వరూపమే. ఆత్మనాత్మల కుండే హద్దు చెరిగిపోయి రెండూ ఏకాత్మగా దర్శనమిస్తాయి. ఇదే పరిపూర్ణాద్వైత దృష్టి. అనాత్మ జగత్తును కూడా విశేషాకారంగా గాక సామాన్య రూపంగా మార్చుకొని చూడటం. క్రొత్తగా మార్చుకోనక్కర లేదు గూడా. వస్తుతంత్రంగా అది అన్నింటిలో ఉండనే ఉంది. ఎటు వచ్చీ అది అక్కడే ఉన్నట్టు గుర్తించటమే నీవు చేయవలసిన పని.

  ఇలా నిరంతరమూ విశేషాత్మకంగా కనిపించే ప్రపంచాన్ని సామాన్యాకారంగా దర్శిస్తూ పోతేఅది గట్టిగా నిలబడిందో జీవన్ముక్తి సిద్ధించినట్టే నీకు. ఎలా ఉంటుందది. నహినస్త్యా త్మనాత్మానం. వాడు తన ఆత్మను ఆత్మతో హింసించటం బాధించటమనేది ఉండబోదు. ఏమిటీ మాట కర్ధం. చాలా వింతగా ఉందే అనిపిస్తుంది. వింత ఏమీ లేదు. మనమర్ధం చేసుకోటమే పొరబాటంటారు భాష్యకారులు. హింసించటమంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు